04-07-2025 01:39:02 AM
- చకచకా మూడో ట్రాక్ లైన్ నిర్మాణ పనులు..
- రైల్వేస్టేషన్‌లో మరో ప్లాట్‌ఫారం
- అన్ని విభాగాలు నిర్మాణ పనుల్లో నిమగ్నం
- మూడో ట్రాక్‌లైన్, ప్లాట్ ఫారంతో మెరుగైన సౌకర్యాలు
బెల్లంపల్లి అర్బన్, జూలై 3 : మూడో లైన్ రైల్వే ట్రాక్ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. అన్ని విభాగాల కార్మికులు, అధికారులు నిర్మాణ పనుల్లో నిత్యం నిమగ్నమై పనిచేస్తున్నారు. మూడో లైన్ ట్రాక్ సదుపాయంతో బెల్లంపల్లి రైల్వే స్టేషన్ కు మహర్దశ పట్టింది. మూడో రైల్వే ట్రాక్ ఏర్పాటుతో మరో ప్లాట్ ఫారం సౌలభ్యం అందు బాటులోకి రానుంది. మూడు ఫ్లాట్ ఫారంలతో బెల్లంపల్లి రైల్వే స్టేషన్ కు కొత్త శోభ సంతరించుకోనుంది.
దక్షిణ మధ్య రైల్వే ఇంజనీరింగ్ విభాగం ప్రత్యక్ష పర్యవేక్షణలో ట్రాక్ నిర్మాణ పనులు అత్యంత వేగంగా నాణ్యతగా జరుగుతున్నాయి. కొత్త లైన్ నిర్మాణ పనులతో పాటు మరో ఫ్లాట్ ఫామ్ షెడ్డు నిర్మాణ పనులు కూడా వేగంగా సాగుతున్నాయి. అనునిత్యం రైల్వే స్టేషన్ ఆవర ణలో నిర్మాణ పనుల నిర్వహణలో కార్మికు లు, ఉద్యోగులతో సందడిగా కనిపిస్తోంది. అత్యంత సౌకర్యవంతంగా లైన్ నిర్మాణ పనులు, ప్లాట్ ఫామ్ షెడ్ పైకప్పు పనులు జరుగుతున్నాయి.
లైన్ నిర్మాణ పనులతో పాటు నిర్మిస్తున్న ప్లాట్ ఫామ్ పనులను ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. పక్క ప్రణాళిక బద్ధంగా నాణ్యతగా నిర్మాణ పనులు ఇంజనీర్ విభా గం, ఇతర సాంకేతిక నిపుణుల కను సన్నల్లో జరుగుతున్నాయి.క్రమబద్ధంగా లైన్ నిర్మాణ పనులు పటిష్టంగా జరుగుతున్నాయి.
రైల్వే ట్రాక్ నిర్మాణ పనులతో ప్రయాణికులకు అవస్థలు..
కొంతకాలంగా మూడో లైన్ రైల్వే నిర్మా ణ పనుల దృష్ట్యా ప్రయాణికులకు అవస్థలు తప్పడం లేదు. నిర్మాణ పనులకు ఆటంకం కలగకుండా అధికారులు తరచుగా ట్రైన్లను రద్దు చేస్తున్నారు. దీంతో నిర్మాణ పనుల ఆరంభం నుంచి ట్రైన్ రాకపోకలకి అంతరాయం తప్పడం లేదు. బెల్లంపల్లి నుంచి రాకపోకలు ప్రయాణికులకు రైల్వే నిర్మాణ పనులు అప్పుడప్పుడూ ఆటంకపరుస్తున్నా యి. తాత్కాలిక అసౌకర్యాన్నీ ప్రయాణికులు భరిస్తునే ఉన్నారు.
సికింద్రాబాద్ హైదరాబాద్ మార్గంలో నడిచే సిర్పూర్ కాగజ్నగర్ భాగ్యనగర్ ఎక్స్ప్రెస్, ప్యాసింజర్, ఇతర రైళ్లు బెల్లంపల్లి నుంచి తరచుగా తాత్కాలిక రద్దు తో వేలాది ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం ఏర్పడుతుంది. కొత్త లైన్ నిర్మాణ పనుల వల్ల రైల్వే స్టేషన్ మరింత ఆధునికరణకు నోచుకుంది. సకల నిర్మాణ పనులు పూర్త య్యి బెల్లంపల్లి రైల్వే స్టేషన్ సరికొత్త సోభగులతో త్వరలోనే ప్రయాణికులకు కనువిందు చేయనుంది.