calender_icon.png 4 July, 2025 | 8:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పూజలు సరే.. వేతనాలేవీ?

04-07-2025 01:37:13 AM

- దూప దీప నైవేద్యానికి నిధుల కొరత

- ఉమ్మడి జిల్లాలో 729 మందికి జీతాలు రాక ఇక్కట్లు

నిర్మల్, జూలై 3(విజయక్రాంతి): గుడిలో పూజలు నిర్వహించే పూజారులకు నాలుగు నెలల నుంచి దూప దీప నైవేద్యం కింద నిధులు మంజూరు కాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో మొత్తం 923 ఆలయాలు ఉండగా ఇందులో 729 ఆలయాలను ప్రభుత్వం గుర్తించింది. ప్రభుత్వం దూప దీప నైవేద్యం కింద ఎంపిక చేసిన ఆలయాల్లో ఉన్న పూజారులకు ప్రతినెల పదివేల చొప్పున నిధులను వారి ఖాతా ల్లో జమ చేయవలసి ఉండగా నాలుగు నెలల నుంచి నిధులకు కారణంగా వేతనాలు రావడం లేదని పూజారులు తెలిపారు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నిర్మల్ జిల్లా లో 273 ఆదిలాబాద్ లో 1505 మంచిర్యాలలో 198 ఆస్ఫాబాదులో 103 ఆలయాలు దూప దీప నైవేద్యం కింద రాష్ట్ర దేవాదాయ ధర్మ దయ శాఖ గుర్తించింది. ఈ ఆలయాల్లో పూజలు చేసే పురోహితులకు రూపాయలు 6000 గౌరవించడంతోపాటు మరో నాలుగు వేలు ఆలయంలో నూనె ఇతర పూజ సామాగ్రి ఖర్చులకు గాను వారి ఖాతాలో ప్రభుత్వం ప్రతినెలా జమ చేయవలసి ఉంటుంది

దాతల సహకారంతో పూజ సామాగ్రి

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని వివిధ ఆలయాల్లో పూజలు నిర్వహించే పురోహితులకు దూప దీప నైవేద్యం కింద ప్రతినెల ప్రభుత్వం చెల్లించే పదివేల రూపాయల నిధులు రాకపోవడంతో పూజారుల తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారు. 6000 గౌరవ వేతనంతో పాటు ప్రతినెల ఆలయంలో దూప దీప నైవేద్యానికి అవసరమయ్యే రూపం నూనె ఇతర పూజ సామాగ్రిని నిర్వాణ ఖర్చుల క్రింద మరో 4000 ప్రభు త్వం పూజారుల ఖాతాలో జమ చేయవలసి ఉంటుంది ఫిబ్రవరి మోసం వరకు వేతనా లు విడుదలైన ఇప్పటికీ నాలుగు నెలలు గడిచినప్పటికీ వేతనాలు నిర్వహణ ఖర్చుల కింద పదివేలు రాకపోవడంతో గుడిలో పూజలు నిర్వహించే పూజారులు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

అయితే ఈ పథకం కింద ఎంపికైన ఆలయాల్లో ఎక్కువగా హనుమాన్ ఆలయాలతో పాటు జగదాంబ దేవి ఆలయాలు శివాలయాలు దుర్గమ్మ ఆలయాలు కులదేవతలకు సంబంధించిన ఆలయాలు పోచమ్మ ఆలయాలు ఇతర చిన్న చిన్న ఆలయాలు ఉండడంతో భక్తుల సంఖ్య కొన్ని ఆలయాల్లో తక్కువగా ఉండడంతో ప్రతిరోజు పూజలు నిర్వహిస్తున్నప్పటికీ ఆదాయం లేక ఆర్థిక ఇబ్బం దులను ఎదుర్కొంటున్నారు ప్రతినెల వేతనాలు 010 ఖాతాలో జమ చేస్తామని ప్రభు త్వం ప్రకటించిన ఇప్పటివరకు అది అమలు కావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రతిరోజు ఆలయానికి వెళ్తున్న పూజారులు ఆలయాన్ని శుభ్రపరచి వివిధ పూజా కార్యక్రమాలు నిర్వహించడం ప్రతిరోజు దీపం వెలిగించడం వంటి పనులు చేస్తున్నప్పటికీ వారికి వేతనాలు రాకపోవడంతో కుటుంబ పోషణ భారంగా ఉందని వారు తెలిపారు. ఇప్పటికీ అనేక ఆలయాలు దర్శనానికి వచ్చిన భక్తుల నుంచి నూనె ఇదర పూజ సామాగ్రిని సాయం చేయాలని అభ్యర్థిస్తున్నారు. దాతల సహకారంతో ఆలయాల నిర్వహణ కొనసాగిస్తున్నప్పటికీ నిధులు లేని కారణంగా తాము ఇబ్బందులు పడుతున్నామని ప్రతినెల వేతనాలు చెల్లించాలని పూజారులు పేర్కొంటున్నారు. 

కుటుంబ పోషణ భారంగా.. 

దూప దీప నైవేద్యం కింద కుంటాల మం డలంలోని ఓలా శివాలయంలో 2018 నుంచి పనిచేస్తున్న. ఇప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం తమకు 2000 గౌర వ వేతనాన్ని ఇవ్వగా తర్వాత గౌరవ వేత నం 6000 చేయడం నిర్వాణ ఖర్చుల కింద 4000 ఇస్తామని చెప్పడం తో చాలా సంతోషం అనిపించింది.  నెలలుగా జీతాలు రాక పోవడంతో కుటుంబ పోషణ భారంగా ఉంటుంది. ప్రభుత్వం ప్రతినెల వేతనాలు విడుదల చేయాలి. 

 రాజు పూజారి దాతల సహకారంతోనే..

దూప దీప నైవేద్యం కింద ఎం పికైన ఆలయాల్లో ప్రతిరోజు పూజలు నిర్వహించి దీపాన్ని తప్పనిసరిగా వెలిగించవలసి ఉంటుంది. దీపం వెలిగించడం పూజలు నిర్వహించే సామాగ్రి కొనుగోలు చేయడానికి ప్రభుత్వం 6000 గౌరవ వేతనంతో పాటు మరో నాలుగు వేలు నిర్వహణ ఖర్చుల కింద విడుదల చేయవలసి ఉన్న అవి ప్రతి నెల రాకపోవడంతో దాతల సహకారాన్ని తీసుకుంటున్నాం. భక్తుల సంఖ్య తక్కువగా ఉన్న ఆలయా లు దాతలు కూడా ముందుకు రాకపోవడంతో తామే సొంత ఖర్చులతో ఆల య నిర్వహణ చేపడుతూ.. ఇబ్బందులు పడుతున్నాం.

 శ్రావణ్ కుమార్, పూజారి