calender_icon.png 8 October, 2025 | 12:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓబీసీలకు అగ్రతాంబూలం!

02-10-2025 12:58:45 AM

డాక్టర్ సంగని మల్లేశ్వర్ :

భారత జనాభాలో ఓబీసీలు దాదాపు 56 శాతం ఉన్నారు. స్వాతంత్య్రం వచ్చి 78 ఏండ్లు గడిచినా విద్య, ఉపాధి, రాజకీయ అవకాశాల్లో వీరికి సరైన వాటా లభించడం లేదు. 

దేశ నిర్మాణం, అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్న ఓబీసీలు రిజర్వేషన్లు లేక దశాబ్దాలుగా అణచివేతకు, దోపిడీకి గురవుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటకోసం గత ఆరు నెలలుగా రిజర్వేషన్ల కోసం వివిధ రూపాల్లో వచ్చిన అడ్డంకులను అధిగమించి హైకోర్టు తీర్పు ఉపశమనం ఇచ్చింది. ఇదే అదనుగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిం చాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం శుభపరిణామం.

రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసి 22 నెలలు అయినా.. మండల, జిల్లా ప్రజా పరిషత్తుల పాలకవర్గాల గడువు ముగిసినా కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేసేందుకు నా నా తంటాలు పడాల్సి వస్తుంది. అనుకున్నట్లుగానే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడంతో ఈ సారి జనరల్ స్థానాలు తగ్గి, బీసీలకు అత్యధిక స్థానాలు వచ్చాయి. కలెక్టర్ల ఆధ్వర్యంలో జడ్పీ, ఎంపీపీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు అయ్యాయి.

ఇక ఆర్టీవోలు.. ఎంపీటీసీ, సర్పంచు స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేయగా.. ఎంపీడీవోల ఆధ్వర్యంలో మండలాల వారీగా వార్డుల స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేశారు. ఎ ట్టకేలకు రిజర్వేషన్లు కేటాయిస్తూ ఉత్తర్వు లు వెలువడటంతో గ్రామాల్లో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. రాష్ర్ట ప్రభుత్వం సకాలంలో ఎన్నికలు నిర్వహించక, 42 శాతం రిజర్వేషన్లు పెంపు కార ణంగా రాజకీయ అలజడి మొదలైంది.

కుట్రలను ఛేదించడానికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ నాయకత్వంలో బీసీ సంఘాల ను కూడగట్టి శాసనసభలో మద్దతు తెలిపి న బీజేపీ, ఇతర పార్టీలను కలిసి గవర్నర్‌ను ఒప్పించాలని విజ్ఞప్తి చేయడం గమ నార్హం. తెర వెనుక అడ్డంకులు సృష్టిస్తూనే రాజకీయ పార్టీలన్నీ తమ వ్యూహాలను అమలు చేయడంపై ఇప్పటికే ఫోకస్ పెట్టాయంటే అతిశయోక్తి కాదు.  

మొసలి కన్నీరు

భారత జనాభాలో ఓబీసీలు దాదాపు 56 శాతం ఉన్నారు. స్వాతంత్య్రం వచ్చి 78 ఏండ్లు గడిచినా విద్య, ఉపాధి, రాజకీయ అవకాశాల్లో వీరికి సరైన వాటా లభించడం లేదు. ఇన్నాళ్లు అధికారానికి దూరం చేసిన రెడ్డి, వెలమ, కమ్మలకు ఒక్కసారిగా 42 శాతం బీసీ రిజర్వేషన్లతో అమలు చే స్తూ స్థానిక ఎన్నికల సమరంలో దిగేసరికి  మింగుడు పడడంలేదు. వివిధ స్థానాల్లో పోటీకి సిద్దమైన ద్వితీయ శ్రేణి నాయక త్వం పై మొసలి కన్నీరు కార్చుతున్నారు.

వారి ఆశలపై రిజర్వేషన్లు నీళ్లు చల్లాయని, మారిన రిజర్వేషన్ల ప్రక్రియతో అన్ని పార్టీ లు ఇక రాజకీయాల్లో రాణించడం కష్టమ నే నిరాశ కనిపిస్తోంది. దశాబ్ద కాలంగా అధికారానికి దూరంగా ఉన్న ప్రస్తుత కాం గ్రెస్ ప్రభుత్వంలోనూ అగ్ర కులాల నేతలు ఇలా జరిగిందేంటి అని పశ్చాత్తాపం పడుతున్నారు. ఇప్పటికే అన్ని పార్టీలు 31 జిల్లా ల్లో గెలుపుగుర్రాలు తయారు చేసుకుంటున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు అధికా రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తమకు కలిసి వస్తుందని భావిస్తుంది.

అధికారం కోల్పో యి ప్రతిపక్ష పాత్రకు పరిమితమైన బీఆర్‌ఎస్.. ఇటీవలే కేసీఆర్ తనయ కవిత ఆరో పించినట్టుగా అక్రమంగా సంపాదించిన డబ్బులు బయటకు తీసి ఎలాగైనా ఉనికి కాపాడుకోవాలనే తపనకు గండి పడినట్లయింది. ఎందుకంటే 2018లో బీసీల రిజ ర్వేషన్లు గొంతుకోసి ఇప్పుడు  బీసీలపై ప్రే మ ఒలకపోస్తున్నారు.

పైగా రాజకీయాల్లో బీసీ రిజర్వేషన్ ప్రభావం కన్పిస్తుందా? ప్ర భుత్వం ఇచ్చినా జీవో నిలుస్తుందా? బు ట్టేంగారి మాధవరెడ్డి వేసిన రిజర్వేషన్ వ్యతిరేక పిటిషన్ ప్రభావం చూపుతుందా అని దింపుడు కల్లం ఆశతో బీసీ మేధావులుగా చెప్పుకునే కొందరు కోర్టుకు ఉప్పం దిస్తున్నారు. రిజర్వేషన్ల అంశంలో అగ్రవర్ణ నాయకులంతా ఇలా జరిగింది ఏంటని బాధపడుతుంటే.. సీఎం రేవంత్ కూడా నాలుగు గోడల మధ్య  మదనపడుతున్నారనే చర్చ జోరుగా జరుగుతోంది.

డెడికేటెడ్ కమిషన్‌తో

ఓబీసీల కులగణన విషయంలో బీజేపీ మొదటి నుంచి నాటకాలే ఆడింది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన ఓబీసీ ల ధర్నాతో భయపడి కులగణనకు షెడ్యూ ల్ ప్రకటించింది. కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారం డెడికేటెడ్ కమిషన్ వేసి, కులగణన చేసి.. శాసనసభలో విద్య, ఉద్యోగ రిజ ర్వేషన్లు పెంచుతూ సభ ఏకగ్రీవంగా తీర్మా నం చేసింది. ఆపై బిల్లును గవర్నర్‌కు పం పితే ఇప్పటికీ పార్లమెంట్‌లో చర్చకు తావు ఇవ్వకుండా అడ్డుపడింది.

అయితే సెప్టెంబర్ 30 వరకు ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో మంత్రిమండలిలో తీర్మానం చేసి ఆర్డినెన్స్ తెచ్చింది. ఆర్డి నెన్స్ ఆమోదానికి నోచుకోలేదు పైగా సలహాలకు రాష్ర్టపతికి పంపడం చకచకా జరి గిపోయింది. 42 శాతం రిజర్వేషన్ల బిల్లు రాత్రికి, రాత్రి తెచ్చింది కాదు కదా? రా జ్యాంగంలోని 285 (ఏ) ఆర్టికల్ ద్వారా పంచాయతీ రాజ్ చట్టాన్ని మూడ్ ఆఫ్ హౌజ్‌లో సవరించడంతో బిల్లుకు ఏకగ్రీవంగా ఆమోదం లభించింది. 

కేంద్ర ప్రభు త్వం గవర్నర్‌ను ప్రభావితం చేసి అడ్డుకుంటుందని కాంగ్రెస్ ఒకవైపు, బీసీ సంఘా లు మరోవైపు ఆరోపణలు చేస్తున్నాయి. ఈ అంశాన్ని ఇంతకాలం సాగదీయడం వెనుక కాంగ్రెస్ దురుద్ధేశం ఉందని బీజేపీ, బీఆర్‌ఎస్ ఎదురుదాడికి దిగడం గమనా ర్హం. చివరి ప్రయత్నంగా రేవంత్ ప్రభు త్వం తెచ్చిన ప్రత్యేక జీవో నెం.9 పై రిజర్వేషన్ వ్యతిరేకులు 50 శాతం సీలింగ్ దా టిందని, స్థానిక సంస్థల ఎన్నికలకు వర్తింప చేయాలని కోర్టును ఆశ్రయించారు. అసంబద్ధమైన వాదనలు వినిపించారు. కనీసం ఆరు శాతం కూడా లేని అగ్రవర్ణాలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పెంచినప్పుడు 50 శాతం పరిమితి కనపడలేదా? అంటూ బీసీ సమాజం ప్రశ్నిస్తున్నది.

జనాభాకు అనుగుణంగా

రాజ్యాంగంలోని ఆర్టికల్ 340 ప్రకా రం డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేసి బీసీల ఆర్థిక, స్థితి గతులు ప్రపంచానికి చా టి చెప్పింది. ఆ భరోసాతో ఆర్డినెన్స్ తె చ్చింది తప్పుపట్టే అవసరం ఎక్కడా కనిపించలేదు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం శాసనసభలో తీర్మానం చేసి రాజ్యాంగంలో 285 (ఏ) ఆర్టికల్ ద్వారా రిజర్వే షన్లు తగ్గించడం, పెంచడం అనేది ఆయా రాష్ట్రాలకు కల్పించిన హక్కుగా, బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు ఊదరగొట్టారు.

బీజేపీ, ఓబీసీ జాతీయ అధ్యక్షులు కె లక్ష్మణ్ రాష్ర్ట రిజర్వేషన్లకు కేంద్ర ప్రమేయంతో సంబంధం లేదని వాపోయారు. కేంద్ర, రాష్ర్ట రిజర్వేషన్లు జనాభాకు అనుగుణంగా చేసుకునే స్వేచ్ఛ ఆయా రాష్ట్రా లకు ఉంటుందని స్పష్టం చేశారు. అయితే ఇప్పుడు రిజర్వేషన్లపై ఎక్కడా స్పందించడం లేదు. రాష్ర్టంలో ఉన్న అన్ని పార్టీల కు ‘ఉపర్ షేర్వాణీ అందర్ పరేషానీ’ అన్న మాదిరిగా శాసనసభలో మద్దతు తెలిపి ఇక్కడ గోతులు తవ్వుతున్న జాగృతి మాధవరెడ్డి లాంటి వ్యక్తులకు ఎవరు మద్దతుగా ఉన్నారనేది తేల్చాల్సిన అవసరం ఉంది.

కుంటి సాకులు చెప్పకుండా బీహార్ రా ష్ర్టంలో ఆలా జరిగిందని, మహారాష్ర్టలో ఎన్నికలను కొట్టివేసిందని వ్యతిరేక కోణం లో చూడకుండా, తమిళనాడు ప్రభుత్వా న్ని ఆదర్శంగా తీసుకోని మద్దతు తెలిపిన రాజకీయ పార్టీలు బీసీ రిజర్వేషన్ల కేసులో ఇంప్ల్లీడ్ అయ్యి, అఫిడవిట్ల రూపంలో త మ సానుకూలతను ప్రదర్శించి, చిత్తశుద్ధిని చాటాలి.

రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల8న బీసీ ల రాజ్యాధికారానికి అడ్డు రాకుం డా కుట్రలను ఛేదించే విధంగా దేశంలో పే రుగాం చిన న్యాయ కోవిదులను కేసు వాదనకు పిలిపించే బాధ్యత తీసుకోవాలి. ఇదే జరిగితే అసాధ్యం అనుకున్న రిజర్వేషన్లు ప క్కాగా సుసాధ్యం అవుతుందనే భావన బీ సీ సమాజంలో ఉంది. కాదని అడ్డుకునే కు ట్రలో భాగస్వాములైతే చరిత్ర హీ నులుగా మిగులుతారు. అణచివేతకు తిరుగుబాటు వలె రిజర్వేషన్లు, రాజ్యాధికార ఉద్యమం దేశమంతా ఊపందుకోవడం ఖాయం.

-- వ్యాసకర్త సెల్: 9866255355