02-10-2025 12:55:37 AM
నేదునూరి కనకయ్య :
1981నాటికి గ్రామీణ ప్రాంతాల్లోని కుటుంబాలకు ఒక శాతం మాత్రమే పారిశుధ్య సౌకర్యాలు అందుబాటులో ఉండేవి. వాటిని విస్తృత పరచడానికి 1986లో అప్పటి కేంద్ర ప్రభుత్వం గ్రామీణ పారిశుద్ధ్యం కార్యక్రమాన్ని రూపొందించింది. 1999 నాటికి పారిశుధ్యం ఉద్యమంగా మారిపోయింది. ఈ కార్యక్రమం పై దాదాపు లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేయడంవల్ల 2012 నాటికి పారిశుధ్య సౌకర్యాలున్న గ్రామీణ కుటుంబాల సంఖ్య 32.7 శా తానికి చేరడం ప్రశంసనీయం.
భారత దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 78 సంవత్సరాలు పూర్తున వేళ రాజ్యాంగ లక్ష్యాలు నెరవేర్చే క్రమంలో ఇవాళ కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు పరిశుభ్రతకు పెద్దపీట వేశా యి. అయితే వందేళ్ల క్రితమే మహాత్మా గాంధీ దేశ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగు పరచంలో పారిశుద్ధ్యం ప్రముఖ పాత్ర పోషిస్తుం దంటూ పరిశుభ్రత స్వచ్ఛత ప్రజా ఉద్యమానికి పిలుపునిచ్చారు.
ప్రజల శ్రేయస్సు, ఆరోగ్యం పరిశుభ్రతతోనే ముడిపడి ఉందని మహాత్ముడు పలికిన మాటల్లో చాలా వరకు మూటలుగానే మిగిలిపోయాయి. అయితే బాపూజీ పిలుపు పా లకులకు కనువిప్పు కావాల్సిన అవసరముంది. నేడు జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఆయన బోధనలు గుర్తు చేయడంలో పోటీపడే పాలకులు, అధికారులు పౌరసమాజం, పరిశుభ్రత అంశాలను మాత్రం గాలికొదిలేయడం శోచనీయం. స్వచ్ఛ భారత్‌తోనే సమాజ శ్రేయస్సు సాధ్యమవుతుందన్నది అక్షర సత్యం.
మెరుగుపడిన పారిశుధ్యం
1981నాటికి గ్రామీణ ప్రాంతాల్లోని కుటుంబాలకు ఒక శాతం మాత్రమే పారిశుధ్య సౌకర్యాలు అందుబాటులో ఉండేవి. వాటిని విస్తృత పరచడానికి 1986లో అప్పటి కేంద్ర ప్రభుత్వం గ్రామీ ణ పారిశుద్ధ్యం కార్యక్రమాన్ని రూపొందించింది. 1999 నాటికి పారిశుధ్యం ఉద్యమంగా మారిపోయింది. ఈ ఉద్యమం ‘నిర్మల్ భారత్ అభియా న్’గా మారిపోయింది. ఇరవై ఐదేళ్ల కాలంలో ఈ కార్యక్రమం పై దాదాపు లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేయడంవల్ల 2012 నాటికి పారిశుధ్య సౌకర్యాలున్న గ్రామీణ కుటుంబాల సంఖ్య 32.7 శా తానికి చేరడం ప్రశంసనీయం.
2014లో కేంద్రం లో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ ఏడాది అక్టోబర్ 2న గాంధీ జయంతి పురస్కరించుకొని ప్రధాని మోదీ ‘స్వచ్ఛ భారత్’ కార్యక్ర మాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం వల్ల 11 కోట్లకు పైగా వ్యక్తిగత మరుగు దొడ్లు, 2లక్షలకు పైగా కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్సులు నిర్మితమవ్వడం గొప్ప విషయం. ఇక పారిశుధ్యంతో పా టు పరిశుభ్రత మెరుగు పడడం వల్ల దేశంలో ఏ డాదికి 70వేల శిశు మరణాలు తగ్గాయని వైద్యారోగ్య సర్వేలు, నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
ప్రభుత్వం పారిశుధ్యం కోసం చేస్తున్న కృషిలో గణనీయమైన ప్రగతి సాధించినప్పటికీ అనేక మారుమూల గ్రామాల్లో ఇప్పటికీ బహిరంగ ప్ర దేశాల్లో మల, మూత్ర విసర్జన సమస్యలు తీరడం లేదు. స్వచ్ఛ భారత్ కింద నిర్మితమైన మరుగుదొడ్ల నాణ్యత లోపించిందని పార్లమెంటరీ స్థా యి సంఘం విమర్శించడం గమనార్హం. గ్రామీణ ప్రాంతాల్లో గిరిజన ప్రాంతాల్లో మరుగుదొడ్ల వాడకం పట్ల ప్రజలు మొగ్గు చూపడం లేదని వాటి వాడకం ఏటా తగ్గుతుందని ప్రపంచబ్యాంకు అధ్యయన బృందం తెలిపింది.
నెరవేరని లక్ష్యాలు
పరిశుభ్రత, పారిశుధ్యం విషయంలో మెరుగుదల ఉన్నప్పటికీ కేంద్రం తీసుకొచ్చిన ‘స్వచ్ఛ భా రత్’ లక్ష్యాలు అనుకున్న మేర నెరవేరలేదని చె ప్పొచ్చు. ముఖ్యంగా పట్టణాల్లో, నగరాల్లో పారిశుధ్యం పడకేసింది. గ్రేటర్ హైదరాబాద్ అని గొప్పగా పిలుచుకునే మన భాగ్య నగరంలో ఏ కాలనీ చూసినా చెత్త గుట్టలు గుట్టలుగా పేరుకుపోయి కనిపిస్తుంది. 2021లో స్వచ్ఛ భారత్ అర్బ న్ 2.0 కార్యక్రమంలో భాగంగా దేశ వ్యాప్తంగా 2,411 డంపింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
అయితే ఇవన్నీ నిరుపయోగంగానే ఉన్నాయని చెప్పడానికి ఇప్పటివరకు పోగైన 22.11 కోట్ల టన్నుల చెత్త ప్రధాన సాక్ష్యం. ఇప్పటి వరకు 9.06 కోట్ల టన్నుల వ్యర్థాలను మాత్రమే తొలగించారు. దేశ వ్యాప్తంగా పట్టణాల్లో చెత్త సేకరణ విభజన కార్యక్రమం సక్రమంగా జరగడం లేదు. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడం వల్ల మురుగునీరు, పారిశ్రామిక, రసాయన వ్యర్థాలు నేరుగా నదుల్లో చేరడం వల్ల అవి పూర్తిగా కలుషితమవుతున్నాయి.
జల వనరులు కలుషితం కావడం వ ల్ల నగర శివార్లకు ఆనుకొని ఉన్న గ్రామాలపై తీవ్ర ప్రభావం చూపుతంది. విషపూరిత వ్యర్ధాలు చెరువులు, నదుల్లో కలవడం వల్ల వ్యవసాయం తో పాటు పంట దిగుబడిపై ప్రభావం పడుతుంది. అనేక కుటుంబాలు వ్యాధుల బారిన పడి ఆసుపత్రుల పాలవ్వడంతో వారి ఆర్థిక భారం పెరిగిపోతుంది. ప్రజలు అనారోగ్యానికి గురై ఉత్పాదక సామర్థ్యం తగ్గడం వల్ల ఆదాయాలు తగ్గుతున్నాయి. కొనుగోలు శక్తి పెరగడం లేదు.
అవగాహన అవసరం
పారిశుధ్యం, స్వచ్ఛత, పచ్చదనం, పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ, కాలుష్యంపై ప్రభుత్వం అవగాహన చైతన్య సదస్సులు నిర్వహించాల్సిన అవసరముంది. ఇప్పటికీ స్వచ్ఛ భారత్ కార్యక్రమం జరుగుతున్నప్పటికీ దీనిలో ప్రజలను భాగస్వాములయ్యేలా ప్రోత్సహించాల్సిన అవసరముంది. పరిశుభ్రత, పచ్చదనం, స్వచ్ఛతలో మెరుగైన విధానాలను అవలంబించిన గ్రామాలకు, వార్డులకు, పట్టణాలకు స్వచ్ఛత అవార్డులు ఇచ్చి ప్రోత్సహించాలి.
కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు పారిశుధ్యం, పరిశుభ్రతకు ఎక్కువ నిధులు కేటాయించడంతో పాటు సరిపోయే సిబ్బందిని నియ మించాలి. బహిరంగ మలవిసర్జన చేయకుండా అరికట్టాలి. దీంతో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల జీవన ప్రమాణాలు పెంచడం, పర్యావరణానికి సరిపోయే పారిశుధ్య పద్ధతుల ఉపయోగాన్ని ప్రోత్సాహించడం లాంటివి చేయాల్సిన అవసరముంది. పారిశుధ్యం కోసం అధునాతన సాంకే తిక పరిజ్ఞానం ఉపయోగించి కమ్యూనిటీ టాయిలెట్స్‌ను నిర్మించాలి.
టాయిలెట్స్ నిర్మాణానికి ఇస్తున్న ప్రోత్సాహకాలను రూ. 2 వేల నుంచి 12 వేలకు పెంచడం స్వచ్ఛత సాధనకు ఉపయోగపడే చర్యగా పేర్కొనవచ్చు. ప్రజారోగ్య రక్షణే లక్ష్యంగా కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు పరిశుభ్రత, పచ్చదనం, స్వచ్ఛత పట్ల మరింత శ్రద్ధ పెంచి ఆరోగ్య భారత్ ఆవిర్భావానికి పాటుపడాలని ఆశిద్దాం. చివరగా భారత్‌కు రెండో ప్రధానమంత్రిగా సేవలందించిన స్వాతంత్య్ర సమరయో ధుడు లాల్ బహదూర్ శాస్త్రి జయంతి కూడా ఇవాళే. ‘జై జవాన్.. జై కిసాన్’ అని నినదించడమే గాక వాటి ప్రాధాన్యతను నొక్కి చెప్పిన మహనీయుడైన శాస్త్రిని స్మరించుకోవాల్సిందే.
- వ్యాసకర్త సెల్: 9440245771