calender_icon.png 23 October, 2025 | 11:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్సిపాలిటీల అభివృద్ధికి పెద్దపీట

22-10-2025 01:19:44 AM

 రూ.45 కోట్ల నిధులు ప్రొసీడింగ్ కాపీ పత్రాలుఅందజేత 

అలంపూర్, అక్టోబర్ 21: గద్వాల్ జిల్లా పరిధిలోని అలంపూర్, వడ్డేపల్లి, అయిజ మున్సి పాలిటీల అభివృద్ధికి సంబంధిం చి రాష్ట్ర ప్రభుత్వం రూ.45 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు టెలి కం అడ్వైజరీ కమిటీ మెంబర్ ఇ స్మాయిల్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్ లోని మహాత్మ జ్యోతిబా ఫూలే ప్రజా భవన్ కార్యాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ ఆధ్వర్యంలో ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా ఒక్కో మున్సిపాలిటీకి రూ.15 కోట్ల నిధుల చొప్పున మొత్తం మూడు మున్సిపాలిటీలకు కలిపి రూ. 45 కోట్ల నిధుల ప్రొసీడింగ్ కాపీ పత్రాలను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చేతుల మీదుగా తీసుకున్నట్లు ఆయన తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీల అభివృద్ధికి కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం అన్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్ర మంలో నాయకులు మహేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.