calender_icon.png 23 October, 2025 | 12:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోచారంలో కాల్పుల కలకలం.. ముగ్గురు అరెస్ట్

23-10-2025 09:11:52 AM

హైదరాబాద్: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా(Medchal Malkajgiri District) పోచారం పరిధిలో బుధవారం గోరక్షకుడిపై జరిగిన హత్యాయత్నానికి సంబంధించి రాచకొండ పోలీసులు(Rachakonda Police) ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. కాల్పుల కేసులో ఇబ్రహీం, మోసిన్, శ్రీనివాస్ అరెస్ట్ కాగా, హనీఫ్ ఖురేషి పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. రాంపల్లి నివాసి సోను సింగ్ అలియాస్ ప్రశాంత్ పై పశువుల వ్యాపారి(Cattle trader) ఇబ్రహీం దేశీయంగా తయారు చేసిన ఆయుధంతో కాల్పులు జరపడంతో గాయపడ్డాడు.

ఇబ్రహీం తో పాటు మరో ఇద్దరు వ్యక్తులు ఉన్నారని సమాచారం. ఆ తర్వాత ఆ ముగ్గురూ కారులో పారిపోయారు. సోనును మొదట స్థానిక ఆసుపత్రికి తరలించారు. తరువాత మెరుడైన చికిత్స కోసం సికింద్రాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటన తర్వాత దాడి చేసిన వారిని పట్టుకోవడానికి పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఇప్పటివరకు నలుగురిని అరెస్టు చేశారు. ఈ దాడిని ఖండిస్తూ బీజేపీ(Bharatiya Janata Party ) పార్టీ గురువారం తెలంగాణ డీజీపీ కార్యాలయం ముందు నిరసన ప్రదర్శన నిర్వహించనున్నట్లు ప్రకటించింది.