23-10-2025 10:20:11 AM
అమరావతి: ఏపీలోని తుని రూరల్ గురుకుల పాఠశాల విద్యార్థినిపై తాటిక నారాయణరావు అనే కామాంధుడు అత్యాచార యత్నానికి పాల్పడిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఏపీలోని తుని రూరల్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులో పోక్సో చట్టం కింద నిందితుడిగా ఉన్న తాటిక నారాయణరావు (62) మృతి చెందాడు. తుని పట్టణ శివారులోని చెరువులో నారాయణ రావు మృతదేహం లభ్యం అయింది. అరెస్టు చేసి కోర్టుకు తీసుకెళ్తుండగా నిందితుడు నారాయణరావు చెరువులో దూకాడు. బాత్‌రూమ్ వస్తుందని చెప్పడంతో పోలీసులు వాహనాన్ని చెరువు పక్కన నిలిపారు. బాత్‌రూమ్‌కు వెళ్లిన నిందితుడు తుని పట్టణ శివారులోని చెరువులో దూకాడు. గల్లంతైన నిందితుడి కోసం పోలీసులు గజఈతగాళ్లతో రాత్రి వెతికారు. ఉదయం మళ్లీ గాలింపు చేపట్టగా చెరువులో నిందితుడి మృతదేహం లభించిందని పోలీసులు తెలిపారు.