calender_icon.png 23 October, 2025 | 3:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి అడుగులు

22-10-2025 01:18:07 AM

చిన్న నీటిపారుదల శాఖ పాత కార్యాలయ కూల్చివేత    

కల్వకుర్తి అక్టోబర్ 21: పట్టణంలోని శివాజీ చౌరస్తాలో ఉన్న పాత చిన్న నీటిపారుదల శాఖ కార్యాలయ స్థలంలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి అడుగులు ముందుకు పడుతున్నాయి. ఎన్నో ఏళ్లుగా కార్యాలయం శిథిలావస్థకు చేరడంతో మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో మరోచోట నూతన భవన నిర్మాణం స్థలానికి కేటాయించి నిధులు మంజూరు చేశారు.

దీంతో పాత కార్యాలయం మున్సిపాలిటీ శాఖ స్వాధీనం చేసుకొని కాంప్లెక్స్ నిర్మాణానికి మంగళవారం కూల్చివేతలు ప్రారంభించారు. పట్టణ నడిబొడ్డున ఎంతో విలువైన స్థలం కావడంతో దుకాణ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేస్తే మున్సిపాలిటీ కి ఆదాయంతో పాటు ప్రజలకు ఎంతో మేలు జరగనుంది. కాంప్లెక్స్ నిర్మాణానికి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి నిధులు మంజూరు చేయడంతో త్వరలోనే నిర్మాణం చేపట్టనున్నట్లు కమిషనర్ మహమూద్‌షేక్‌తెలిపారు.