23-10-2025 11:01:08 AM
అడిలైడ్ వేదికగా జరుగుతున్న భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా(India vs Australia) రెండో వన్డేలో రోహిత్ శర్మ హఫ్ సెంచరీ చేశాడు. ఒకే ఓవర్ లో రెండు సిక్స్ లు బాదిన రోహిత్ వన్డేలో 59వ అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం భారత్ ఇన్నింగ్స్ సాఫీగా సాగుతోంది. 2015 నుంచి ఇప్పటి వరకు అత్యంత నెమ్మదిగా చేసిన హాఫ్ సెంచరీ ఇదే కావడం విశేషం. ఈ మ్యాచ్ లో రోహిత్ 74 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేశాడు. ప్రస్తుతం భారత్ 25.3 ఓవర్లకు రెండు వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ శర్మ(62), శ్రేయస్ (41) నిలకడగా ఆడుతున్నారు.