calender_icon.png 23 October, 2025 | 1:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆబ్కారీశాఖలో ఐఏఎస్ అధికారి వీఆర్ఎస్ వివాదం

23-10-2025 09:51:15 AM

హైదరాబాద్: అబ్కారీశాఖలో ఐఏఎస్ అధికారి వీఆర్ఎస్ కు వివాదం దారితీసింది. ఎక్సైజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు(Excise Minister Jupally Krishna) ఫిర్యాదులే ఐఏఎస్ రిజ్వీ(IAS officer Rizvi) వీఆర్ఎస్ కు దారితీసినట్లు సమాచారం. ఎక్సైజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీపై మంత్రి జూపల్లి కృష్ణరావు సీఎస్ కు ఫిర్యాదు చేశారు. లిక్కర్ బాటిళ్లకు వేసే హై-సెక్యూరిటీ హోలోగ్రామ్ ల టెండర్లలో వివాదం చోటుచేసుకుంది. టెండర్ ను రిజ్వీ ఉద్దేశపూర్వకంగా నిలిపివేశారని ఎక్సైజ్ శాఖ మంత్రి ఫిర్యాదులో పేర్కొన్నారు. 2019 నుంచి పోటీ లేకుండా పాత కాంట్రాక్టర్ ను కొనసాగించారని అభ్యంతరం వ్యక్తం చేశారు. కొత్త హోలోగ్రామ్ టెండర్లను వేయాలని రిజ్వీకి మంత్రి జూపల్లి ఆదేశించారు. తన ఆదేశాలను ఐఏఎస్ రిజ్వీ పాటించడం లేదని మంత్రి జూపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. రిజ్వీ వీఆర్ఎస్ ప్రతిపాదనను తిరస్కరించాలని మంత్రి జూపల్లి సిఫారసు చేశారు. నిన్న రిజ్వీ స్థానంలో వాణిజ్య పన్నుల కమిషనర్ కు అదనపు బాధ్యతలు అప్పగించారు.