calender_icon.png 23 October, 2025 | 1:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గంజాయి పట్టుకున్న టాస్క్ ఫోర్స్ అధికారులు

23-10-2025 09:23:22 AM

తూప్రాన్,(విజయక్రాంతి): బుధవారం అర్ధరాత్రి రాత్రి 11:30 గంటల సమయంలో మహారాష్ట్ర నుండి కారులో హైదరాబాద్ కు భారీ స్థాయిలో గంజాయి తరలిస్తుండగా మెదక్ జిల్లా తూప్రాన్ టోల్ ప్లాజా(Toopran Toll Plaza) వద్ద గంజాయి పట్టుబడింది. వివరాలు ఇలా ఉన్నాయి. భారీ స్థాయిలో గంజాయి మహారాష్ట్ర నాగపూర్ నుండి హైదరాబాదుకు తరలించే క్రమంలో కుటుంబంతో కలిసి ప్రయాణం చేస్తే ఎవరికి అనుమానం రాదన్న కోణంలో నిందితులు పక్క ప్లాన్ వేసుకుని తరలిస్తుండగా టాస్క్ ఫోర్స్ అధికారులకు అనుమానం వచ్చి కారును వెంబడించగా తూప్రాన్ సమీపంలోని టోల్ ప్లాజా వద్ద అధికారుల ఎస్కార్ట్ కారును అడ్డం తిప్పడంతో తప్పించబోయి బోల్తా పడింది. దాంతో కారులో ఉన్న గంజాయి భారీ స్థాయిలో పట్టుబడింది. సుమారు 100 కిలోల గంజాయిని టాస్క్ ఫోర్స్ అధికారులు స్వాధీనం చేసుకొని నిందితులను తూప్రాన్ పోలీస్ స్టేషన్ తరలించారు.