ఫారెక్స్ నిల్వల్లో 3 బిలియన్ డాలర్ల క్షీణత
ముంబై, డిసెంబర్ 13: రిజర్వ్‌బ్యాంక్ వద్దనున్న విదేశీ మారక నిల్వలు మళ్లీ క్షీణబాట పట్టాయి. శుక్రవారం ఆర్బీఐ విడు దల చేసిన గణాంకాల ప్రకారం డిసెంబర్ 6తో ముగిసిన వారంలో ఫారిన్ ఎక్సేంజ్ (ఫారెక్స్) రిజర్వులు 3.23 బిలియన్ డాలర్లు తగ్గి 654.857 బిలియన్ డాలర్ల వద్ద నిలిచాయి. కొద్దివారాలపాటు అదేపనిగా తగ్గిన ఫారెక్స్ నిల్వలు నవంబర్ 29తో ముగిసినవారంలో 2 బిలియన్ డాలర్ల మేర పెరిగినప్పటికీ, తాజా సమీక్షావారంలో మళ్లీ తగ్గుముఖం పట్టాయి. సెప్టెంబర్ చివరినాటికి ఫారెక్స్ నిల్వలు 704.885 బిలియన్ డాలర్ల ఆల్‌టైమ్ గరిష్ఠస్థాయికి చేరిన సంగతి తెలి సిందే.
ఆ స్థాయి నుంచి వరుస 9 వారా ల్లో దాదాపు 48 బిలియన్ డాలర్లు క్షీణించాయి. తాజాగా డిసెంబర్ 6తో ముగిసిన వారంలో విదేశీ మారక నిల్వ ల్లో ప్రధాన భాగమైన విదేశీ కరెన్సీ ఆస్తు లు 3.228 బిలియన్ డాలర్లు క్షీణించి 565.623 బిలియన్ డాలర్ల స్థాయికి చేరాయి. అమెరికా డాలరుయేతర కరెన్సీలైన యూరో, పౌండు, యెన్ తదితర విదే శీ కరెన్సీల విలువ డాలరుతో పోలిస్తే తగ్గుదల, పెరుగుదలను కరెన్సీ ఆస్తుల లెక్కిం పులో పరిగణనలోకి తీసుకుంటారు.
తగ్గిన బంగారం నిల్వలు
ఆర్బీఐ వద్దనున్న బంగారం నిల్వలు సమీక్షావారంలో 43 మిలియన్ డాలర్లు తగ్గి 66.936 బిలియన్ డాలర్లకు చేరాయి. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (ఎస్‌డీఆర్‌లు) 25 మిలియన్ డాలర్లు పెరిగి 18.031 బిలియన్ డాలర్ల వద్ద నిలిచినట్లు రిజర్వ్‌బ్యాంక్ తెలిపింది. ఐఎంఎఫ్ వద్దనున్న రిజర్వులు కూడా 12 మిలియన్ డాలర్లు పెరిగి 4.266 బిలియన్ డాలర్ల వద్దకు చేరాయి.




