10 April, 2026 | 11:28 AM

రిటైల్ ఇన్వెస్టర్లకు ఆల్గో ట్రేడింగ్ సదుపాయం

14-12-2024 12:00 AM

న్యూఢిల్లీ, డిసెంబర్ 13: స్టాక్ మార్కెట్లో శరవేగంగా ట్రేడింగ్‌కు వీలుకల్పించే ఆల్గోరిథమ్ ట్రేడింగ్ సదుపాయాన్ని రిటైల్ ఇన్వెస్లర్లకు కూడా కల్పించాలని ప్రతిపాదిస్తున్న ట్లు మార్కెట్ రెగ్యులేటర్ సెబీ  తెలిపింది. డైరెక్ట్ మార్కెట్ యాక్సెస్ (డీఎ ంఏ) ద్వారా ఇప్పటివరకూ సంస్థాగత ఇన్వెస్టర్లకు మాత్రమే అందుబాటులో ఉన్న ఆల్గో ట్రేడింగ్‌తో ఆర్డర్లు సెకన్ల లో పూర్తవుతాయి. ట్రేడింగ్ వ్యయా లు తగ్గుతాయి. రిటైలర్లకు ఆల్గో ట్రే డింగ్ సదుపాయాన్ని ప్రతిపాదిస్తూ సెబీ శుక్రవారం ఒక చర్చాపత్రాన్ని విడుదల చేసింది.