పాతికేళ్ల తర్వాత.. కనిపించిన బోర్డు!?
30-06-2026 12:10 AM
కేసముద్రం, జూన్ 29 (విజయక్రాంతి): కేసముద్రం వ్యవసాయ మార్కెట్ ఎదుట ప్రహరీ గోడపై సుమారు పాతికేళ్ల క్రితం ‘లాల్ బహుదూర్ గంజ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ’ సైన్ బోర్డు ఆర్టిస్ట్ చేత రాయించారు. ఆ తర్వాత కొంతకాలానికి మార్కెట్ ప్రహరీ గోడకు ఆనుకొని చాలామంది నిరుపేదలు స్వయం ఉపాధి కోసం గుంచీలు వేసుకొని, క్రమక్రమంగా షెడ్లు కూడా నిర్మించుకున్నారు.
దీనితో మార్కెట్ ‘నేమ్ బోర్డు’ వాటి మరుగున పడిపోయింది. కొద్దిరోజుల క్రితం మార్కెట్ ప్రహరి గోడకు తొర్రూరు కేసముద్రం ప్రధాన రహదారిపై ఉన్న చిరు వ్యాపారులు, స్వయం ఉపాధిపై ఆధారపడ్డ వారి గుంచీలు, షెడ్లను రోడ్ల విస్తరణ కోసం పూర్తిగా తొలగించడంతో పాతికేళ్ల క్రితం నాటి ‘మార్కెట్ నేమ్ బోర్డు’ బయటపడింది.






