09-10-2025 06:15:01 PM
మాజీ ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్ లో చేరికలు..
తాండూరు (విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం కాంగ్రెస్ పార్టీ ఎస్టీసెల్ అధ్యక్షులు నారాయణతో పాటు దాదాపు 50 మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. పెద్దదేముల్ మండలం ఎర్రగడ్డ తండా గ్రామ పంచాయతీకి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు మండల కాంగ్రెస్ పార్టీ ఎస్టీసెల్ అధ్యక్షులు నారాయణ, నాయకులు లక్ష్మణ్, శివ, వెంకటేష్, శంకర్ జాదవ్, సురేష్, వీరేందర్, మోహన్ సింగ్, సేవ్లా, గోపాల్, రాము, జగన్, మాజీ వార్డ్ మెంబర్ గోబ్ర్య, వినాయక్, సజని బాయి, నాయకులు థౌర్యా, హీరసింగ్ లతో పాటు యువకులు మహిళలు పార్టీలో చేరారు.
వారికి మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గులాబీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ లో చేరిన నాయకులు మాట్లాడుతూ 50 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకొని ఉన్నామని ఎన్ని అవాంతరాలు ఎదురైనా కూడా పార్టీని విడలేదని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక సరైన ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో విరక్తి చెందామని అన్నారు. మాజీ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో గిరిజన తండాలను గ్రామపంచాయతీలు ఏర్పాటు చేసిన ఘనత టీఆర్ఎస్ కే ఉందని వారు తెలిపారు.