09-10-2025 06:11:41 PM
వనపర్తి టౌన్: జిల్లా కేంద్రంలోని ఈవీఎంలు భద్రపరిచిన గోదాము కట్టుదిట్టమైన భద్రత నడుమ ఉందని జిల్లా కలెక్టర్ ఆదర్ష్ సురభి తెలిపారు. గురువారం ఆర్డీవో కార్యాలయం వెనక ఉన్న ఈవీఎం, వీవీప్యాట్ గోదామును నెలవారీ తనిఖీల్లో భాగంగా జిల్లా కలెక్టర్ అదనపు కలెక్టర్ రెవెన్యూ ఖీమ్య నాయక్, ఆర్డీవో సుబ్రహ్మణ్యంతో కలిసి పరిశీలించారు. ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా గోదాం వద్ద భద్రతా ఏర్పాట్లను తనిఖీ చేశారు. సీసీ కెమెరాల భద్రతా వ్యవస్థను పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు ఈవీఎం, వీవీ ప్యాట్ గోదామును తనిఖీ చేసి సమగ్ర నివేదికను సమర్పిస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో శనివారం నెలవారి తనిఖీ లు చేసినట్లు వివిధ రాజకీయ వివరించారు. తహసిల్దార్ రమేష్ రెడ్డి, ఇతర అధికారులు తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.