13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

పోలీసుల సంక్షేమానికి సరికొత్త భరోసా

31-03-2026 01:04 AM

డీజీపీ శివధర్ రెడ్డి

సికింద్రాబాద్, మార్చి 30 (విజయక్రాంతి):   తెలంగాణ పోలీసుల సంక్షేమానికి మరింత ఊతమిచ్చే దిశగా పోలీస్ శాఖ మరో కీలక అడుగు వేసింది. తెలంగాణ పోలీస్ సం క్షేమ శాఖ ఆధ్వర్యంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సహకారంతో బేగంపేటలో ఏర్పాటు చేసిన నూతన పెట్రోల్ బంక్ ను రాష్ట్ర డీజీపీశివధర్ రెడ్డి, మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి, ప్రొవిజన్స్ అండ్ లాజిస్టిక్స్ ఐజీపీ గజరావు భూపాల్‌తో కలిసి ప్రారంభించి, పెట్రోల్ బంక్‌ను జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ..

పోలీసు సిబ్బందివారి కుటుంబాల అభివృద్ధికి ఈ ఇంధన కేంద్రం ఆదా యం ఎంతగానో దోహదపడుతుందని ఆకాంక్షించారు. ఏర్పాటు చేసిన ఈ బంక్ ద్వారా ప్రజలకు నాణ్యమైన, కల్తీలేని ఇంధనాన్ని అందించడమే కాకుండా, తద్వారా వచ్చే లాభాలను పోలీస్ వెల్ఫేర్ ఫండ్ ద్వారా సిబ్బంది అవసరాలకు వినియోగిస్తామని వివరించారు. కార్యక్రమంలో పోలీసు ఉన్నతా ధికారులతో పాటు ఐఓసీఎల్ ప్రతినిధులు పాల్గొన్నారు.