13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

ఆశాలకు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలి

31-03-2026 01:04 AM

సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు పిట్టల అర్జున్ డిమాండ్

దమ్మపేట, మార్చి 30 (విజయక్రాంతి): ఆశా వర్కర్లు తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని, ప్రభుత్వం ఎన్నికల హామీగా ఇచ్చిన  వాగ్దానం 18 వేల రూపాయల వేతనం  అమలు చేయాలని అడిగితే రాష్ట్ర ప్రభుత్వానికి నేరంగా అగుపిస్తుందని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు పిట్టల అర్జున్ అన్నారు. రాష్ట్ర రాజధానిలో ఆశ వర్కర్ల సమస్యలపై ధర్నా నిర్వహిస్తున్న సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగుల భాస్కర్,  ఇతర నాయకుల అక్రమ అరెస్టులను నిరసిస్తూ సోమవారం తహసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా సునీత అధ్యక్షతన జరిగిన సభలో అర్జున్ మాట్లాడుతూ ఆశా వర్కర్లు ప్రజలకు అనేక రకాల వైద్య సేవలు అందిస్తున్నారని కానీ వారికి ప్రతినెలా సక్రమంగా పారితోషకాలు అందటంలేదని అన్నారు. గత ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే కనీస వేతనాలు ఉద్యోగ భద్రత కల్పిస్తారని ఆశించిన ఆశలకు నిరాశే ఎదురైందని అన్నారు. అనంతరం సిఐటియు మండల కన్వీనర్ మురహరిరఘు మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి ఐక్యతతో  పోరాడటమే మార్గమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్స్ యూనియన్ నాయకులు శారద, రాధ, శ్రీలత, సంధ్య, రజిని, రమణ, నాగమణి, భాగ్యమ్మ తదితరులు పాల్గొన్నారు.