విద్యార్థులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దడమే ఆ పాఠశాల ప్రత్యేకత
శ్రీరామచంద్ర స్కూల్ 14వ వార్షికోత్సవ వేడుకల్లో వ్యవస్థాపకులు డి కృష్ణమోహన్
చర్ల, మార్చి 18 (విజయ క్రాంతి): మండల పరిధిలోని ఆర్ కొత్తగూడెం గ్రామంలో శ్రీ రామచంద్ర(కే యం) స్కూల్- 14వ వార్షికోత్సవం సందర్భంగా పాఠశాల వ్యవస్థాపకులు డి కృష్ణమోహన్ ఆహ్వానం మేరకు ముఖ్యఅతిథిగా మండల విద్యాశాఖ అధికారి పరిటాల వెంకటరమణ హాజరై జ్యోతి ప్రజ్వలనచేసి ఘనంగా ప్రారంభించారు. శ్రీరామచంద్ర పాఠశాల 14వ వార్షికోత్సవం గురువారం పాఠశాల మైదానంలో ఘనంగా జరిగింది.
విద్యార్థుల స్వాగత నృత్యాలతో అతిథులు, తల్లిదండ్రులను ఆహ్వానించారు. పాఠశాల కరస్పాండెంట్ డి కష్టమోహన్ మాట్లాడుతూ విద్యార్థులను చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతికం, సైన్స్ ఎక్స్పో, ఒలింపియాడ్లలో ప్రతిభ చూపేలా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎంఈఓ పరిటాల వెంకటరమణ మాట్లాడుతూ చిన్నారులను ఆల్రౌండర్లుగా తీర్చిదిద్దడం అభినందనీయమని పేర్కొన్నారు.
తల్లిదండ్రులు పిల్లలకి సమయం కేటాయించాలని, పిల్లల కోసం తల్లిదండ్రులు సమయాన్ని త్యాగం చేయాలని, పిల్లలతో ఎక్కువ సమయం గడిపి నైతిక విలువలు నేర్పించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ ఇందల గోపాల బుచ్చిబాబు , గొట్టుముక్కల సీతారామరాజు, ఎడారి శ్రీను, కూరపాటి వీర్రాజు గ్రామ ప్రజలు తల్లిదండ్రులు విద్యార్థులు పాల్గొన్నారు.




