09-10-2024 06:31:27 PM
విజయక్రాంతి కథనానికి స్పందన
అలంపూర్ : అలంపూర్ పరిధిలోని రాజోలి శివారులోని తుంగభద్ర నది తీర ప్రాంతంలో నిత్యం ఇసుక తరలింపు జోరుగా సాగుతున్నదనే విషయాన్ని విజయక్రాంతి పత్రిక వెలుగులోకి తెచ్చింది. పగలు ఎడ్లబండ్లు, రాత్రి టిప్పర్లు కథనంతో అక్టోబరు 3న ప్రచురించింది. దీంతో జిల్లా పోలీసు యంత్రాంగం స్పందిoచి మంగళవారం రాత్రి టిప్పర్ ను పోలీసులు పట్టుకుని పోలీస్ స్టేషన్ కి తరలించారు కేసు నమోదు చేశారు. అనుమానాస్పదంగా ఉన్న ఇంకో టిప్పర్ ను స్టేషన్ కి తరలించి విచారిస్తున్నట్లు ఎస్సై జగదీశ్ తెలిపారు.