సీఎం వ్యాఖ్యలపై కేసు నమోదు చేయాలి
14-07-2026 12:00 AM
జిల్లా ఎస్పీకి బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య పిర్యాదు
సిరిసిల్ల, జులై 13, (విజయ క్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బీఆర్‌ఎస్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య సోమవారం జిల్లా ఎస్పీ మహేష్ బి గీతేకు ఫిర్యాదు చేశారు. జూలై 11న హైదరాబాద్లో జరిగిన విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి చేసినట్టు వస్తున్న వ్యాఖ్యలు రాజకీయ ప్రత్యర్థులు, రైతులను ఉద్దేశించి హింసను ప్రేరేపించేలా ఉన్నాయని ఆయన ఆరోపించారు.
ఈ వ్యాఖ్యలపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్)-2023లోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి నిష్పక్షపాతంగా దర్యాప్తు చేపట్టాలని కోరారు. ప్రతిపక్ష నాయకులు, వారి కుటుంబ సభ్యులు, రైతులకు తగిన భద్రత కల్పించాలని పోలీసు శాఖను విజ్ఞప్తి చేశారు.






