14 July, 2026 | 4:36 AM

పోలీస్ సిబ్బంది కుటుంబాలకు భరోసా పోలీసు భద్రత స్కీమ్

14-07-2026 12:00 AM

ఎస్పీ కె. నరసింహ 

సూర్యాపేట జూలై 13 (విజయక్రాంతి) : పోలీస్ సిబ్బంది కుటుంబాలకు భరోసా పోలీస్ భద్రత స్కీమ్ అని జిల్లా ఎస్పీ కె.నరసింహ అన్నారు. జిల్లాలోని నాగారం పోలీస్ స్టేషన్ నందు కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న కమలాకర్  ఆకాలంగా రోడ్డు ప్ర మాదంలో మృతి చెందినారు. మరణించిన కానిస్టేబుల్ కమలాకర్ కుటుంబానికి పోలీ సు భద్రత స్కీం ద్వారా వచ్చిన నగదు చెక్కు ను  ఎస్పీ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆ యన కుటుంబ సభ్యులకు అందజేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ పోలీసు శాఖలో పని చేస్తూ ప్రాణాలు కోల్పోయిన సిబ్బంది కుటుంబాలను పోలీసు శాఖ అన్ని విధాలుగా అదుకుంటుందని, దివంగత సిబ్బంది కుటుంబాలకు పోలీసు భద్రత స్కీమ్ బాసటగా నిలుస్తుంది అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీసు కార్యాలయం అడ్మినిస్ట్రేషన్ అధికారి మంజు భార్గవి, పోలీసు సంఘం అధ్యక్షులు ఎస్ ఐ రామచందర్ గౌడ్, సిబ్బంది పాల్గొన్నారు.