14 July, 2026 | 4:50 AM

నారాయణ విద్యార్థికి స్వర్ణ పతకం

14-07-2026 12:00 AM

అంతర్జాతీయ ఫిజిక్స్ ఒలింపియాడ్‌లో శ్రేష్ఠ్ సురయ హవా

విశ్వవేదికపై రెపరెపలాడిన భారత కీర్తి పతాకం

హైదరాబాద్, జూలై 13 (విజయక్రాంతి): కొలంబియాలోని బుకారామంగాలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరిగిన 56వ అంతర్జాతీయ ఫిజిక్స్ ఒలింపియాడ్ 2026లో నారాయణ విద్యాసంస్థల విద్యార్థి శ్రేష్ఠ్ సురయ సరికొత్త చరిత్ర సృష్టించారు. ప్రపంచ దేశాల మేధావులతో పోటీపడి, భారతదేశం తరఫున ప్రాతినిధ్యం వహించిన శ్రేష్ఠ్ సురయ అద్భుత ప్రతిభతో బంగారు పతకాన్ని కైవ సం చేసుకున్నాడు. ఈ ఏడాది ఈ అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్న భారత ప్రతినిధి బృందంలోని ఐదుగురు సభ్యులూ స్వర్ణ పతకాలు సాధించడం విశేషం.

తద్వారా చైనా, రష్యా, సౌత్ కొరియా, కజకిస్తాన్, తైవాన్ దేశాలతో కలిసి భారతదేశం ప్రపంచస్థాయిలో ‘జాయింట్ వరల్డ్ ర్యాంక్ నెం.౧’ సా ధించి అగ్రస్థానంలో నిలిచింది. ఈ 56వ ఒలింపియాడ్‌లో ప్రపంచవ్యాప్తంగా 87దేశా ల నుంచి 381 మంది అత్యుత్తమ ప్రతిభావంతులైన విద్యార్థులు పాల్గొన్నారు. కాగా గ్లోబల్ స్టేజ్‌పై గోల్డ్ మెడల్ సాధించడమే కాకుండా, శ్రేష్ఠ్ సురయ ఇటీవల విడుదలైన జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 ఫలితాల్లో ఆల్ ఇండియా 58వ ర్యాంక్ సాధించి తన అసాధారణ విద్యానైపుణ్యాన్ని నిరూపించుకున్నాడు.

ఈ డబుల్ అచీవ్‌మెంట్ నారాయణ విద్యా సంస్థల ప్రపంచస్థాయి శిక్షణకు, విద్యార్థి అంకితభావానికి నిదర్శనంగా నిలుస్తోంది. ఇంతటి ఘన విజయంపై నారా యణ విద్యా సంస్థల డైరెక్టర్ డాక్టర్ సింధూర నారాయణ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘ప్రపంచలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన అంత ర్జాతీయ ఒలింపియాడ్‌లో గోల్డ్ మెడల్ సాధించడంతో పాటు, జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో 58వ ర్యాంక్ సాధించిన శ్రేష్ఠ్ సురయ ను చూసి ఎంతో గర్విస్తున్నామన్నారు.

ఇది శ్రేష్ఠ్ నిరంతర కృషికి, పట్టుదలకు దక్కిన గౌరవం. ఈ గెలుపు నారాయణ కుటుంబానికే కాకుండా దేశ మొత్తానికి గర్వకారణం’ అని కొనియాడారు. నారాయణ విద్యా సంస్థల్లో మేము కాన్సెప్చువల్ లెర్నింగ్, క్రమశిక్షణతో కూడిన అభ్యాసం, వ్యక్తిగత పర్యవేక్షణ ద్వారా విద్యార్థులను తీర్చిదిద్దుతున్నామన్నారు. గత కొన్నేళ్లుగా నారాయణ విద్యార్థులు ఐపీహెచ్‌వో, ఐసీహెచ్‌వో, ఐబీ వో, ఐవోఏఏ, ఐజేఎస్‌వో, ఐఎంవో, ఎన్‌ఎంటీసీ వంటి అనేక అంతర్జాతీయ వేదికలపై దేశానికి ఘనమైన కీర్తిని తీసుకువచ్చారని పేర్కొన్నారు. కాగా ఈ విజయానికి కృషి చేసిన టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.