కులగణన కమిషన్ ఏర్పాటు చేయాలి
జాజుల శ్రీనివాస్ గౌడ్
హైదరాబాద్ సిటీబ్యూరో, మే 29 (విజయక్రాంతి): కులగణన విషయంలో కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇచ్చిన హామీని కచ్చితంగా నెరవేరుస్తుందని నమ్ముతున్నామని, కులగణన కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. నగరంలోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బీసీ కుల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ‘స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్ల పెంపు, భవిష్యత్ కార్యాచరణ’ అనే అంశంపై బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రిజర్వేషన్లు పెంచి బీసీలకు వాటా దక్కాకే ఎన్నికలు నిర్వహించాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. సమావేశంలో రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు, బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేశ్‌చారి, కో చైర్మన్ చిన్నశ్రీశైలం యాదవ్, ప్రొఫెసర్లు గాలి వినోద్‌కుమార్, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.






