28 July, 2026 | 6:47 AM

అభివృద్ధి పనులు పూర్తి చేయాలి

30-05-2024 01:27 AM

కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

హైదరాబాద్ సిటీబ్యూరో, మే 29 (విజయక్రాంతి): అమ్మ ఆదర్శ పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ లో పనుల పురోగతి, బడిబాట, యూనిఫామ్స్, పుస్తకాల పంపిణీపై సమీక్ష నిర్వహించారు. జూన్ 10 లోపు పనులను పూర్తి చేయాలని సూచించారు. సమావేశంలో అదన పు కలెక్టర్లు పాటిల్ హేమంతకేశవ్, కదిరవన్ పొలాని, డీఈవో ఆర్ రోహిణి, టీజీఈడబ్ల్యూడీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు చలపతిరావు, నాయుడు తదితరులు పాల్గొన్నారు.