మాటలు వింటున్న కోడి
18-06-2024 12:16 AM
- సామాజిక మాధ్యమాల్లో వీడియోలు వైరల్
కోడిని చూసేందుకు తరలివస్తున్న ప్రజలు
జగిత్యాల, జూన్ 17(విజయక్రాంతి): జగిత్యాల జిల్లా రూరల్ మండలంలోని లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన ఎడమల మల్లారెడ్డి కోళ్ల ఫారం నిరహిస్తున్నాడు. అందులో కడక్‌నాథ్ అనే రకం కోడి తన యజమాని మాటలు వింటోంది. మల్లారెడ్డి ఆ కోడిని ముందుకు రమ్మంటే వస్తుంది.. వెనక్కు వెళ్లమంటే వెళ్తుంది. ఎక్కడికి వెళ్లినా ఆయనతోనే వెళ్తుంది. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో కోడిని చుసేందుకు ప్రజలు తరలివస్తున్నారు.






