14 April, 2026 | 4:46 AM

కుప్పకూలిన డ్యామ్

27-08-2024 01:45 AM

60 మంది మృతి, అనేక మంది గల్లంతు

సూడాన్‌లోని రెడ్ సీ స్టేట్‌లో ఘటన

సూడాన్, ఆగస్టు 26: ఆఫ్రికా దేశమైన సూడాన్‌లోని భారీ వర్షా ల కారణంగా రెడ్ సీ రాష్ట్రంలోని అర్బాత్ డ్యామ్ కుప్పకూలింది. దీంతో చుట్టుపక్కల గ్రామాల్లోకి భారీగా వరద పోటెత్తింది. ఈ ఘటనలో సుమారు 60 మంది వరకు ప్రాణాలు కోల్పోయి ఉండవచ్చని, 100 మందికిపైగా గల్లంతైనట్లు సూ డాన్ వార్తా చానెల్ తెలిపింది. నష్టం కూడా తీవ్ర స్థాయిలో జరిగినట్లు రెడ్ సీ రాష్ట్ర నీటి పారుదల శాఖ అధికారి పేర్కొన్నారు. మొబైల్ నెట్‌వర్క్ పనిచేయకపోవడంతో సమా చార సేకరణ ఇబ్బందికరంగా ఉన్న ట్లు స్థానిక మీడియా వెల్లడించింది.