14 April, 2026 | 2:49 AM

అభ్యర్థుల జాబితాపై బీజేపీ యూటర్న్

27-08-2024 01:46 AM

కార్యకర్తల నిరసనలతో కశ్మీర్‌లో వెనక్కి తగ్గిన కమలం

16 మందితో కొత్త లిస్టు రిలీజ్

న్యూఢిల్లీ, ఆగస్టు 26: జమ్ముకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ అభ్యర్థుల ఎంపికలో హైడ్రామా నడిచింది. మొదట తొలి విడుత ఎన్నికల కోసం 44 మంది అభ్యర్థుల పేర్లతో సో మవారం తొలి జాబితాను విడుదల చే సింది. ఈ జాబితా ప్రకటన తర్వాత పార్టీ అధిష్ఠానంపై కార్యకర్తలు బహిరంగంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. జమ్ములోని పార్టీ ప్రధాన కార్యాలయంలో నిరసనలు చేపట్టారు. దీంతో హడావుడిగా ఆ లిస్టు ను వెనక్కి తీసుకున్న బీజేపీ అధిష్ఠానం కేవలం 15 మంది పేర్లతో మరోసారి జా బితాను ప్రకటించింది. కొద్ది సేపటి తర్వా త ఒకరి పేరుతో మరో లిస్టు రిలీజ్ చేసిం ది. కాగా, గత పదేళ్లలో బీజేపీలో ఇంత బహిరంగంగా శ్రేణులు విభేదించిన సందర్భాలు లేకపోవడం గమనార్హం.