12-07-2025 12:07:26 AM
పటాన్‌చెరు, జూలై 11: రాష్ట్రంలోని మదర్సాలలో వందల సంఖ్యలో ఇతర రాష్ట్రాలకు చెందిన వారు వచ్చి నెలల తరబడి ఇక్కడే ఎం దుకు ఉంటున్నారో, అక్కడ ఎలాంటి కార్యకలాపాలు నిర్వహిస్తున్నారో అనే విషయాలపై సమగ్ర విచారణ జరుపాలని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పటాన్‌చెరు మండలం రుద్రారంలోని హునమాన్ ఆలయంలో విగ్రహాల ధ్వంసం ఘటనపై ఆయన తీవ్రంగా ఖండించారు.
ఎమ్మెల్సీ అంజిరెడ్డి, బీజేపీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి, బీజేపీ జిల్లా, పటాన్‌చెరు నియోజకవర్గ నాయకులతో కలిసి ఎంపీ రఘునందన్‌రావు శుక్రవారం ఆలయాన్ని పరిశీలించారు. విగ్రహం ధ్వంసం చేసింది పిచ్చి వాడంటూ పేర్కొనడంపై ఎంపీ ఆగ్ర హం వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి పి చ్చి వాళ్లు వచ్చి కేవలం హిందు ఆలయాలపై మాత్రమే ఎందుకు దాడులు చేస్తున్నారని ప్ర శ్నించారు.
పిచ్చి వాళ్లకు సీసీ కెమెరాలు తొలగించి దాడులు చేయాలయనే అవగాహన ఉంటుందా అని ప్రశ్నించారు. ఇది ఒక పథకం ప్రకారం జరుగుతున్న కుట్ర అని, హిందువుల సహనం నశించకముందే సమగ్ర విచారణ జరిపి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సికింద్రాబాద్, సదాశివపేట, జిన్నారం, రుద్రారం సంఘటనల్లో రాష్ర్టే తరులే దాడులకు పాల్పడ్డారని ఆరోపించారు.
ఇక్కడి మారుమూల ప్రాంతాలోని మదర్సాలలో రాష్ర్టేతరులు వచ్చి ఎందుకు ఉంటున్నా రు, నెలల తరబడి ఏం చేస్తున్నారో పోలీసులు ఎందుకు విచారించరని ప్రశ్నించారు. రుద్రా రం ఘటనపై సమగ్ర విచారణ జరుపాలని కోరారు.
ఆయనవెంట బీజేపీ రాష్ట్ర నాయకులు రాజేశ్వర్‌రావు దేశ్‌పాండే, జిల్లా ఉపా ధ్యక్షుడు పోచారం రాములు, ప్రతాప్‌రెడ్డి, సంగమేశ్వర్, బీజేవైఎం నాయకులు ప్రవీన్, హిందూ సంఘాల నాయకులు సుభాష్, రుద్రారం గ్రామ నాయకులు పెంటేశ్, రాజేశ్, వీరారెడ్డి, సుధీర్‌రెడ్డి ఉన్నారు.