calender_icon.png 21 February, 2026 | 2:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కౌన్సిలర్

21-02-2026 12:51:32 AM

చిట్యాల, పిబ్రవరి 20 : చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని పదో వార్డు కౌన్సిలర్ నిమ్మనగోటి శ్రీనివాస్ వార్డు ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో తనను కౌన్సిలర్ గా గెలిపిస్తే  వార్డు పరిధిలోని ప్రతి ఇంటి ఆడ బిడ్డ వివాహానికి రూ.10,016 లను కానుకగా ఇస్తానని మాట ఇచ్చారు.

ఇచ్చిన మాట ప్రకారం అంబేద్కర్ నగర్ కు చెందిన కీ. శే సుంకరి నరసింహ - పద్మల ప్రథమ పుత్రిక రాజేశ్వరి వివాహానికి కౌన్సిలర్ నిమ్మనగోటి శ్రీనివాస్, యువశక్తి యువజన సంఘం సభ్యులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి  రూ.10,016లను కానుకగా అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యువశక్తి యువజన సంఘం అధ్యక్షుడు ఐలపురం నరేష్, సంఘ సభ్యులు పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు.