థ్రిల్లింగ్ క్రైమ్ స్టోరీతో తొలిసారి!
కరీనా కపూర్ ఖాన్, పృథ్వీరాజ్ సుకుమారన్ తొలిసారి కలిసి నటిస్తున్న చిత్రం ‘డాయ్రా’. జంగ్లీ పిక్చర్స్, పెన్ స్టూడియోస్ సంయుక్తంగా ఈ సినిమా నిర్మిస్తోంది. యదార్థ ఘటనల ప్రేరణతో రూపొందించిన ఈ చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీత చిత్ర నిర్మాత మేఘనా గుల్జార్(Meghna Gulzar) దర్శకత్వం వహించారు.
ఈ మూవీని యశ్ కేశ్వాని, సీమా అగర్వాల్, మేఘనా గుల్జార్ రచించారు. సెప్టెంబర్18న థియేటర్లలో రిలీజ్ కానున్న ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ ఆగస్టు 31న విడుదల చేయనున్నారు. ఈ అప్డేట్ ఇస్తూ చిత్రబృందం విడుదల చేసిన పోస్టర్‌లో కరీనా కపూర్ ఖాన్, పృథ్వీరాజ్ సుకుమారన్ సినిమాపై ఆసక్తిని రేకెత్తించేలా ఉంది. సత్యం, న్యాయం, జవాబుదారీతనం కలిసే ఒక ఉత్కంఠభరితమైన కథను ఈ క్రైమ్ థ్రిల్లర్ ద్వారా చెప్పబోతున్నామని టీమ్ పేర్కొంది.






