10 June, 2026 | 12:58 AM

ఆవుల పోట్లాటలో మహిళ మృతి

10-06-2026 12:10 AM
  1. అదుపు లేని పశువుల బెడదతో విషాదం
  2. సింగరేణి కార్మికుడి తల్లి ఘటనా స్థలంలోనే మృతి

మణుగూరు, జూన్ 9( విజయక్రాంతి) :  మణుగూరు సింగరేణి ఏరియా పరిధిలోని పీవీ కాలనీలో మంగళవారం తెల్లవారు జామున జరిగిన విషాద ఘటనలో ఓ వృద్ధ మహిళ ప్రాణాలు కోల్పోయింది. స్థానికుల కథనం ప్రకారం.. మణుగూరు సింగరేణి ఏరియాలోని ప్రకాశం ఖని ఓపెన్కాస్ట్2లో ‘ఏ’ రిలే ఆపరేటర్గా పనిచేస్తున్న చింతల శ్రీనివాస్ తల్లి చింతల ఎల్లమ్మ (80) తన స్వగ్రామమైన ఇల్లందుకు వెళ్లేందుకు తెల్లవారుజామున కుమారుడి క్వార్టర్ నుంచి బస్ స్టాప్ వైపు నడుచుకుంటూ వెళ్తున్నారు.

ఈ క్రమంలో పీవీ కాలనీ రహదారిపై సంచరిస్తున్న ఆవులు, ఎద్దులు పరస్పరం పోట్లాడుకుం టూ వేగంగా రావడంతో, వాటి మధ్య చిక్కుకున్న ఎల్లమ్మపై కొమ్ములతో దాడి చేశాయి. తీవ్ర గాయాలపాలైన ఆమె ఘటనాస్థలంలోనే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనతో పీవీ కాలనీలో విషాద ఛాయలు అలుముకు న్నాయి. కాలనీలో చాలా కాలంగా పశు వులు స్వేచ్ఛగా సంచరిస్తున్నప్పటికీ, వాటి నియంత్రణకు సంబంధిత అధికా రులు చర్యలు తీసుకోకపోవడంపై స్థాని కులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కాలనీలో ఆవులు, ఎద్దులు గుంపులుగా సంచరిస్తూ తరచూ రహదారులపై ప్రమాదకర పరిస్థితులు సృష్టిస్తున్నాయ ని, పలుమార్లు ఫిర్యాదులు చేసినా సమ స్య పరిష్కారానికి చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి, కాలనీలలో సంచ రిస్తున్న నిరాశ్రయ పశువుల నియంత్ర ణకు తక్షణ చర్యలు చేపట్టాలని కార్మిక కుటుంబాలు, స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అలాగే భవిష్యత్తులో ఇలాం టి ఘటనలు పునరావృతం కాకుండా పీవీ కాలనీతో పాటు ఇతర కార్మిక కాలనీల్లోనూ భద్రతా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.