03-08-2025 12:00:00 AM
రాజు జెయమోహన్, ఆధ్య ప్రసాద్, భవ్య త్రిఖ హీరోహీరోయిన్లుగా వినోదాత్మక కుటుంబ కథా చిత్రం ‘బన్ బటర్ జామ్’. రాఘవ్ మిర్‌దత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు సురేశ్ సుబ్రమణియన్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. రెయిన్ ఆఫ్ ఎరోస్, సురేశ్ సుబ్రమణియన్ నిర్మాతలు. ఔట్ అండ్ ఔట్ కామెడీ మూవీగా రూపొందిన ఈ ఫన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తమిళంలో సూపర్ హిట్ అయ్యింది.
ఇప్పుడీ చిత్రాన్ని తెలుగులో శ్రీవిఘ్నేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సీహెచ్ సతీశ్‌కుమార్ విడుదల చేయనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఆగస్టు 8న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఈ మూవీ టీజర్‌ను టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు మెహర్ రమేశ్ విడుదల చేశారు. టీజర్‌ను గమనిస్తే..
తల్లిదండ్రులైన చార్లి, శరణ్య పొన్ వనన్ తమ కొడుకు గొప్పతనం గురించి మరొకరితో ఫోన్‌లో చెబుతుంటారు. మరోవైపు హీరో క్యారెక్టర్‌ను ఫన్నీగా ప్రజెంట్ చేశారు. హీరో, హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్‌ను కూడా ఎంటర్‌టైనింగ్ వేలోనే చూపించారు. ఈ చిత్రానికి సంగీతం: నివాస్ కే ప్రసన్న; సినిమాటోగ్రఫీ: బాబుకుమార్; ఎడిటర్: జాన్ అబ్రహం; ఆర్ట్: శశికుమార్.