calender_icon.png 11 August, 2025 | 10:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాతీయ అవార్డులు బాధ్యత పెంచాయి: బేబి టీమ్

03-08-2025 12:00:00 AM

ప్రతిష్టాత్మక 71 జాతీయ అవార్డ్స్‌లో ‘బేబి’ సినిమా రెండు నేషనల్ అవార్డ్స్ గెల్చుకున్న విషయం తెలిసిందే. ఉత్తమ స్క్రీన్ ప్లే రైటర్‌గా సాయిరాజేశ్, ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్‌గా పీవీఎన్ ఎస్ రోహిత్ (ప్రేమిస్తున్నా పాట) అవార్డ్ గెల్చుకున్నారు. ఈ నేపథ్యంలో శనివారం ఈ మూవీ టీమ్ పాత్రికేయ సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో చిత్ర యూనిట్ పాల్గొని జాతీయ అవార్డ్స్ పొందిన సంతోషాన్ని షేర్ చేసుకున్నారు.

ఈ కార్యక్రమంలో చిత్రబృందం మాట్లాడుతూ.. ‘బేబి సినిమాకు నేషనల్ అవార్డ్ మాపై మరిన్ని మంచి చిత్రాలు చేయాలనే బాధ్యత పెంచింది’ అన్నారు. హీరో ఆనంద్ దేవరకొండ, హీరోయిన్ వైష్ణవి చైతన్య, డైరెక్టర్ సాయి రాజేశ్, నిర్మాతలు ఎస్ కేఎన్, ధీరజ్ మొగిలినేని, సింగర్ పీవీఎన్ ఎస్ రోహిత్, ఎడిటర్ విప్లవ్, లిరిక్ రైటర్ సురేశ్ బనిశెట్టి, మిగతా చిత్రబృందం పాల్గొన్నారు.