చైన్ స్నాచింగ్ ముఠా గుట్టు రట్టు
పోలీసుల అదుపులో నలుగురు నిందితులు
15.7 తులాల బంగారం స్వాధీనం
నిజామాబాద్, జూన్ 10 (విజయక్రాంతి): నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న నలుగురు సభ్యుల ముఠాను ఆర్మూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆర్మూర్‌లోసోమవారం ఏసీపీ బస్వారెడ్డి వివరాలు వెల్లడించారు. మంచిర్యాల్ జిల్లాకు చెందిన అబ్దుల్ సాజిద్, పాతూరి తరుణ్, నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లికి చెందిన బోయర్ శంకర్, నిజామాబాద్‌కు చెందిన సాయికుమార్ పాత పరిచయంతో ముఠాగా ఏర్పడ్డారు. వీరంతా మోర్తాడ్, బాల్కొండ, ఆర్మూర్, లక్ష్మణచాంద ప్రాంతాల్లో చైన్‌స్నాచింగ్‌కు పాల్పడ్డారు.
బాధితులు పలు పోలీస్‌స్టేషన్లలో కేసులు నమోదు చేశారు. మోర్తాడ్ పోలీసులు ఇటీవల వాహనాలు తనిఖీ చేస్తుండగా, అనుమానాస్పదంగా కనిపించిన సాజిద్, తరుణ్, శంకర్, సాయి కుమార్‌ను అదుపులోకి తీసుకున్నా రు. వారిని తమదైన శైలిలో విచారించగా అసలు బయటపడింది. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని, వారి నుంచి 15.7 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించిన మోర్తాడ్ ఎస్సై అనిల్‌రెడ్డి, సిబ్బంది సురేష్, నారాయణ, నవీన్‌చంద్రను ఏసీపీ బస్వారెడ్డి అభినందించారు






