calender_icon.png 22 September, 2025 | 9:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెంపుడు కుక్కకు ఘనంగా అంతిమ వీడ్కోలు

22-09-2025 08:15:45 AM

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి): పెంపుడు జంతువులతో మనుషులకు ఉండే అవినాభావ సంబంధం ఒక్కొక్కసారి వెలకట్టలేనిది. వాటిని కూడా ఇంట్లో సొంత మనిషిలా చూసుకుంటారు కొందరు. అయితే ఓ పెంపుడు కుక్క అకస్మాత్తుగా చనిపోగా దానికి ఘనంగా అంతిమ వీడ్కోలు నిర్వహించాడు యజమాని. ఈ ఘటన సూర్యాపేట జిల్లా(Suryapet District) అర్వపల్లి మండల కేంద్రంలో ఆదివారం జరిగింది. సూర్యాపేట జిల్లా యువజన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు వేల్పుల రమేష్ గత నాలుగు సంవత్సరాలుగా అల్లారుముద్దుగా పెంచుకుంటున్న తన పెంపుడు కుక్క జాకి అనారోగ్యంతో మరణించగా ఆయనతోపాటు ఆ కుటుంబం బోరును విలపించింది.తన కుటుంబ సభ్యుడు చనిపోతే ఎలా అంత్యక్రియలు నిర్వహిస్తారో దానికి కూడా అలాగే చేశారు.తనతో ఉన్న జ్ఞాపకాలను మర్చిపోలేమంటూ తన స్వంత స్థలంలో జాకీకి ఘనంగా అంత్యక్రియలు నిర్వహించి ఖననం చేశారు.ఈ సంఘటనలతో జిల్లాలోని జంతు ప్రేమికులు కొందరు విస్మయానికి గురై జాకీకి కన్నీటి వీడ్కోలు పలికారు.