22-09-2025 08:18:28 AM
బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు దొంగరి యుగేందర్
పెన్ పహాడ్ : రానున్న స్థానిక సంస్థల ఎన్నికలో(Local body elections) పల్లె పల్లెనా గులాబీ జెండా ఎగరాలని అందుకు బూత్ లెవల్లో ఉన్న నాయకులు, కార్యకర్తలదే బాధ్యతని బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు దొంగరి యుగేందర్ అన్నారు. ఆదివారం మండలంలోని పొట్లపహాడ్ లో బీఆర్ఎస్ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో ఏర్పాటు చేసిన కార్యక్రమం అయన పాల్గొని మాట్లాడారు. గులాబీ పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో మధు, పెండం చంద్రశేఖర్, రామినేని కృష్ణయ్య, చల్ల శ్రీకాంత్ రెడ్డి,గుత్తికొండ సత్యనారాయణ రెడ్డి, నారాయణ జగన్ రెడ్డి, పటాన్ అక్రమ్ ఖాన్ తదితరులు ఉన్నారు.