calender_icon.png 22 September, 2025 | 3:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నవశకం ఆరంభం

22-09-2025 01:45:13 AM

నేటి నుంచే జీఎస్టీ కొత్త స్లాబులు అమలు

-జీఎస్టీ సంస్కరణలు.. దేశ ప్రగతికి సోపానాలు

-‘నాగరిక్ దేవో భవ’ నినాదంతో ముందుకెళ్తున్నాం

-ఆదా ఉత్సవం మొదలైంది.. స్వదేశీ ఉత్పత్తులే కొనండి

-విదేశీ వస్తువుల వాడకం తగ్గించండి

-ప్రతి పౌరుడూ స్వదేశీ ప్రతిజ్ఞ చేయాలి.. 

-దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 21: జీఎస్టీ సంస్కరణలతో దేశంలో నవశకం ఆరంభం కానుందని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. ఈ సంస్కరణలు దేశ ప్రగతికి సోపానాలని అభివర్ణించారు. సోమవారం నుంచి జీఎస్టీ 2.0 సంస్కరణలు ప్రారంభం కానున్న నేప థ్యంలో ఆదివారం సాయంత్రం న్యూఢిల్లీ నుంచి దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.

‘దేశం జీఎస్టీ ఆదా ఉత్సవం జరుపుకోనున్నది. సోమవారం నుంచి జీఎస్టీ ఉత్సవ్ ఆరంభం కానుంది. ఈ సంస్కరణలతో మీ పొదుపు పెరుగుతుంది. మీరు మీకు నచ్చిన వస్తువును కొనుక్కునేందుకు వీలుంటుంది. ఈ సంస్కరణ సమాజంలోని అన్ని వర్గాల వారికి ఉపయోగం గా ఉండబోతుంది. 2014లో ఎంతోమంది భారతీయులు, ఎన్నో కంపె నీలు వివిధ రకాల పన్ను సమస్యలు ఎదుర్కొన్నాయి.

ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లేందుకు సామాన్యులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. నేటి నుంచి కేవలం వినియోగ వస్తువులు మాత్రమే కాకుండా అన్ని రకాల వస్తువుల ధరలు కూడా తగ్గనున్నాయి. బడ్జెట్‌లో ప్రకటించిన విధంగా రూ. 12 లక్షల వరకు ఆదాయానికి ఎటువంటి పన్ను లేదు. ఇది సామాన్యులకు ఎంతో ప్రయోజనకరం. గత 11 సంవత్సరాల్లో 25 కోట్ల మంది భారతీయులు పేదరికం నుంచి బయటపడ్డారు.

నేటి నుం చి పేదలు, మధ్యతరగతి ప్రజలు డబుల్ బొ నాంజా అందుకోనున్నారు. జీఎస్టీ స్లాబుల సవరణలతో నిత్యావసరాల ధరలు తగ్గి.. అనేక మంది తమ కలలను మరింత సులభంగా నెరవేర్చుకోగలరు. నాగరిక్ దేవో భవ అనే నినాదంతో ముందుకు వెళ్తున్నాం. ఈ సంస్కరణలు దేశ వృద్ధికి దోహదం చేస్తాయి. వ్యాపారాలను మరింత సులభంగా మారుస్తాయి. జీఎస్టీ సంస్కరణలతో అన్ని రా ష్ట్రాలు అభివృద్ధి చెందనున్నాయి. జీఎస్టీతో వన్ నేషన్ ట్యాక్స్ స్వప్నం సాకారమైంది’ అని పేర్కొన్నారు. 

స్వదేశీ ప్రతిజ్ఞ చేయండి.. 

దేశంలోని ప్రతి ఒక్క పౌరుడు స్వదేశీ ప్రతిజ్ఞ చేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ‘మన జేబులో ఉన్న దువ్వెన భారత్ లో తయారైందో లేదో మనకు తెలియదు. ఇక నుంచి మనం స్వదేశీ వస్తువులనే కొనా లి. ప్రతి ఇంట్లో స్వదేశీ వస్తువులు కనిపించాలి. ఇవి స్వదేశీ ఉత్పత్తులే అని గర్వంగా చెప్పండి. జీఎస్టీ తగ్గింపుతో అనేక రకాల వస్తువుల ధరలు తగ్గనున్నాయి. పెట్టుబడులు పెరగనున్నాయి. జీఎస్టీతో వన్ నేషన్  వన్ ట్యాక్స్ స్వప్నం సాకారమైంది.

జీఎస్టీ సంస్కరణలు ఆత్మనిర్భర్ భారత్ అజెండా. దేశ పౌరులందరూ స్వదేశీ మంత్రం పాటించాలి. దేశంలోని ప్రతిఒక్కరూ స్వదేశీ ప్రతిజ్ఞ తీసుకోవాలి’ అని మోదీ దేశ పౌరులకు పిలుపునిచ్చారు. ఇన్ని రోజులుగా ఉన్న జీఎస్టీ స్లాబులను కేంద్రం ఇటీవలే సవరించింది.

ఈ సవరించిన స్లాబుల ప్రకారం సా మాన్యులు నిత్యం ఉపయోగించే అనేక వస్తువుల ధరలు తగ్గనున్నాయి. ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ నేతృత్వంలోని జీఎస్టీ కౌన్సిల్ ప్రతిపాదనల ప్రకారం సవరించిన జీఎస్టీ స్లాబులు సోమవారం నుంచే అమల్లోకి రానున్నాయి. ఇకపై రెండే స్లాబుల్లో వస్తువులపై జీఎస్టీ విధించనున్నారు. ఈ నేపథ్యంలోనే జాతినుద్దేశించి ప్రసంగించిన మోదీ దేశ ప్రజలకు దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు కూడా తెలియజేశారు.