calender_icon.png 13 January, 2026 | 7:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైభవంగా అపూర్వ విద్యార్థుల సమ్మేళనం

13-01-2026 02:26:40 AM

ముషీరాబాద్, జనవరి12 (విజయక్రాంతి): సరూర్‌నగర్ కార్మన్‌ఘట్‌లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో 1987- బ్యాచ్‌కు చెందిన10వ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులు తమ పూర్వ జ్ఞాపకాలు, తీపి గుర్తులను గుర్తు చేసుకున్నారు. 39 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో విద్యార్థులు కష్టసుఖాలను ఒకరికొకరు పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.