calender_icon.png 13 January, 2026 | 5:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నా కుటుంబంపై ఆరోపణలు పట్టించుకోను

13-01-2026 02:28:03 AM

మంథని అభివృద్ధే లక్ష్యం

ఇందిరమ్మ ఇండ్ల పట్టాల పంపిణీలో ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు

మంథని, జనవరి 12 (విజయక్రాంతి): ‘నా కుటుంబంపై అనవసరపు ఆరోపణలు చేస్తున్న వారిని పట్టించుకోను. మంథని ప్రాంత అభివృద్ధి ఆశయంగా ముందుకు సాగుతా’అని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు.  సోమవారం మంథనిలో ఇందిరమ్మ లబ్ధిదారులకు పట్టాలను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాజకీయాలలో ప్రత్యర్థులు ఒకరిపై ఒకరు ఆరోపించుకోవడం సహజమని, కానీ తన కుటుంబంపై వ్యక్తిగతంగా ఆరోపణలు చేస్తున్న కొంతమందికి తాను పట్టించుకోనని తెలిపారు. తనపై నమ్మకంతో ఓటు వేసి గెలిపించిన మంత్రి నియోజకవర్గ ప్రజలను మర్చిపోనని, ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నానని, దీంతో పెద్ద ఎత్తున ఈ ప్రాంతానికి నిధులు తీసుకొచ్చి అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తాన్నానని అన్నారు.

ఇప్పటివరకు మంథని పట్టణంలో దాదాపు రూ.50 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశానని, అన్ని కుల సంఘాలకు భవనాలు మంజూరు చేశానని, ఇంకా ఏమైనా మిగిలి ఉంటే వారికి కూడా నిధులు మంజూరు చేస్తానన్నారు. ఇందిరమ్మ ఇల్లు రాని వాళ్ళు ఆందోళన పడద్దని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇండ్లు మంజూరు చేస్తామని చెప్పారు. రాజకీయాలలో తన పేరు తలవందే కొంతమందికి పూట గడవదని, అటువంటి వారికి ప్రజలే రాబోయే రోజుల్లో బుద్ధి చెప్తారన్నారు.