13-01-2026 02:26:20 AM
బ్రాండ్ అంబాసిడర్ జస్ప్రీత్ బుమ్రా సమక్షంలో..
హైదరాబాద్, జనవరి 12 (విజయక్రాంతి): టీఎంటీ స్టీల్ బ్రాండ్ శ్రీ టీఎంటీ ‘రైజ్ అప్ డీలర్స్ మీట్ 2026 టు గెదర్ టు ది టాప్’ ను హైదరాబాద్ హైటెక్ సిటీలోని ట్రైడెంట్ హోటల్‌లో ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి శ్రీ టీఎంటీ బ్రాండ్ అంబాసిడర్ జస్ప్రీత్ బుమ్రా హాజరయ్యారు. ఆయన డీలర్లతో మాట్లాడి, శ్రీ టీఎంటీ బ్రాండ్ ప్రతిబింబించే బలం, స్థిరత్వం, పనితీరును ప్రశంసించారు. డీలర్లు, వ్యాపార భాగస్వాములు పెద్ద సంఖ్యలో పాల్గొని, భవిష్యత్ వృద్ధి ప్రణాళికలపై చర్చించారు. దేవశ్రీ ఇస్పాట్ ప్రైవేట్. లిమిటెడ్ (శ్రీ టీఎంటీ) సీనియర్ నాయకత్వం హాజరైంది.
వారిలో ప్రకాశ్ గోయంకా, మేనేజింగ్ డైరెక్టర్, నీరజ్ గోయంకా, డైరెక్టర్, సిద్ధార్థ్ గోయంకా, డైరెక్టర్, కరణ్ గోయంకా, సీఈఓ ఉన్నారు. వారు మాట్లాడుతూ.. మౌలిక సదుపాయాల అభివృద్ధిలో స్టీల్ ప్రాధాన్యతను వివరించారు. శ్రీ టీఎంటీ ఎప్పుడూ నాణ్యత, బలం, విశ్వసనీయతపై రాజీ పడలేదని, 5-స్టార్ రేటింగ్, గ్రీన్ప్రో సర్టిఫికేషన్, ప్రభుత్వ అనుమతులు మార్కెట్లో మాపై ఉన్న నమ్మకానికి నిదర్శనం అన్నారు. డీలర్లతో కలిసి మరిన్ని ప్రమాణాలను నెలకొల్పడమే తమ లక్ష్యం అని అన్నారు. బ్రాం డ్ విలువలు తన ఆటలోని క్రమశిక్షణ, స్థిరత్వంతో సరిపోతాయని బుమ్రా తెలిపారు.