calender_icon.png 9 November, 2025 | 9:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా విశ్వబ్రాహ్మణుల కార్తీక మాస వన సమారాధన మహోత్సవం..

09-11-2025 07:27:00 PM

విశ్వబ్రాహ్మణులు ఐక్యతను చాటాలి..

టేకులపల్లి (విజయక్రాంతి): విశ్వబ్రాహ్మణులంతా సంఘటితమై తమ ఐక్యతను చాటాలని టేకులపల్లి విశ్వబ్రాహ్మణ సంఘ నాయకులు కోరారు. టేకులపల్లి మండలంలోని రోల్లపాడు సమీపంలోని ఆరోమైల్ అటవీ ప్రాంతంలో కార్తిక మాసం సందర్భంగా టేకులపల్లి విశ్వబ్రాహ్మణులు వన భోజనాలలో ఆదివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశ్వబ్రాహ్మణ నాయకులు మాట్లాడుతూ.. విశ్వబ్రాహ్మణులంతా సంఘటితమై తమ ఐక్యతను చాటాలని, టేకులపల్లి వీరబ్రహ్మద్రస్వామి దేవాలయ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని, విశ్వబ్రాహ్మణులు అభివృద్ధికి ఒకరికి ఒకరు తోడ్పాటు అందించుకోవాలని అన్నారు.

కార్తీక మాసంలో చెట్ల కింద సామూహికంగా భోజనాలు చేయడం వల్ల వనస్వరూప స్వామి ప్రసాదాన్ని స్వీకరించిన అనుభూతి కలుగుతుందని, ఆధ్యాత్మిక ప్రాధాన్యతను కలిగి ఉంటుందని అన్నారు. టేకులపల్లి విశ్వబ్రాహ్మణలు కార్తిక మాసం సందర్భంగా  వన సమారాధన మహోత్సవంలో కుటుంబ సమేతంగా పాల్గొని ఆటపాటలతో ఆహ్లాదంగా గడిపారు. మహిళలకు, చిన్నారులకు క్రీడాపోటీలు నిర్వహించి బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో టేకులపల్లి విశ్వబ్రాహ్మణులు ధర్మపురి శ్రీనివాసచారి, తౌడోజు బిక్షమయ్య, గజ్జల రామ్ శేఖర్, అనంతుల శ్రీశైలం, నోముల భాస్కరాచారి, ధర్మపురి జనార్ధన చారి, చిలకమర్రి రామకృష్ణ, అన్నారపు వెంకటేశ్వర్లు, ధర్మపురి వీర బ్రహ్మచారి, భౌరోజు బిక్షమయ్య, కటుకోజ్వల సురేష్ కుమార్, ఎన్. కళావతి, ఆకారపు స్వప్న, అన్నారపు లక్ష్మీనారాయణ, చంద్రగిరి రాధాకృష్ణ, ఉరిమెల్ల యాదాచారి , వజ్రాల పరిపూర్ణ చారి, అనుగోజు నటరాజ్ తదితరులు  పాల్గొన్నారు.