09-11-2025 07:30:37 PM
మైనారిటీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాకూబ్ పాషా..
కొత్తగూడెం (విజయక్రాంతి): నవంబర్ 11న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జన్మదినాన్ని పురస్కరించుకొని జాతీయ విద్యాదినోత్సవం, మైనారిటీ సంక్షేమ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని ఈ నెల 6న ఉత్తర్వులు జారీ చేయటం పట్ల మైనార్టీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యండీ. యాకూబ్ పాషా ఆదివారం నాడు ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేసారు.
భారతదేశపు మొట్ట మొదటి విద్యాశాఖ మంత్రి, స్వాతంత్ర సమర యోధుడైన మౌలానా అబుల్ కలాం ఆజాద్ జన్మదినాన్ని మైనారిటీ సంక్షేమ దినోత్సవంగా నిర్వహించాలని 2015లో మైనారిటీ సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసినప్పటికి, రాష్ట్రంలో ఎక్కడ కూడా మైనారిటీ సంక్షేమ దినోత్సవాన్ని నిర్వహించకుండా నిర్లక్షం చేసారని, ఇట్టి విషయాన్ని పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందన్నారు. దీంతో స్పందించిన మైనార్టీ సంక్షేమ శాఖ గత ఏడాది నుండి ఉత్తర్వులు జారీ చేయడము జరుగుతుందని అన్నారు. దీంతో రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో నవంబర్ 11న జాతీయ విద్యా దినోత్సవం, మైనారిటీ సంక్షేమ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.