21-09-2025 08:28:25 PM
బెజ్జంకి: ఒక్కేసి పువ్వేసి చందమామ ఒక్కజాములాయే చందమామ.. అంటూ మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ పండుగ సంబురాలు ఆదివారం బెజ్జంకి మండల పరిధిలోని అన్ని గ్రామాలలో ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా ఆడపడుచులు ఉపవాసం ఉండి రంగురంగుల తీరొక్క పూలతో బతుకమ్మలను అందంగా పేర్చారు. సాయంత్రం కూడళ్లు, ఆలయాల వద్ద బతుకమ్మలను పెట్టి ఆడగా, పాటలతో ఆలయాలు, వీధులన్నీ మార్మోగాయి. అనంతరం మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ నృసింహ ఆలయ సమీపంలోని కొలనులో నిమజ్జనం చేశారు.