calender_icon.png 21 September, 2025 | 9:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజల పక్షపాతి ఎమ్మెల్యే జి.ఎస్.ఆర్.

21-09-2025 08:22:34 PM

టేకుమట్ల కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కోటగిరి సతీష్ గౌడ్...

చిట్యాల/టేకుమట్ల (విజయక్రాంతి): భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు(MLA Gandra Satyanarayana Rao) ప్రజల పక్షపాతిగా నిరంతరం అభివృద్ధికి పాటుపడుతున్నాడని, ప్రతిపక్షాలు అసత్యపు ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని టేకుమట్ల కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు కోటగిరి సతీష్ గౌడ్ హెచ్చరించారు. ఆదివారం టేకుమట్ల మండల కేంద్రంలో కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ఏర్పాటుచేసిన సమావేశంలో సతీష్ గౌడ్ మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి హయాంలో ఇసుక అక్రమ దందా విచ్చలవిడిగా కొనసాగిందని, వందలాది ట్రిప్పులు లారీల ద్వారా ఇతర జిల్లాలకు తరలివెళ్లిందని గుర్తుచేశారు.

నిరుపేద రైతుల భూములు, కల్తీ పెట్రోల్, బొగ్గు మాఫియా లాంటి వ్యాపారవేత్తగా మారిన మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డికి, ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో బుద్ధి చెప్పారన్నారు. కేవలం అక్రమ వ్యాపారాలను కొనసాగించేందుకే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొంది బిఆర్ఎస్ పార్టీకి మారాడని విమర్శించారు. ఇప్పటికైనా అభివృద్ధిలో కలిసి రావాలని, లేదంటే రానున్న రోజుల్లో రాజకీయ పతనం తప్పదని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో  బండ శ్రీకాంత్, బండి రవీందర్, పెరుమాడ్ల క్రాంతి, వంగ నరేష్, కోరే చందు, గొల్లపల్లి వెంకటేశ్వర్లు, యూత్ అధ్యక్షుడు కొల్గూరి అనిల్, మాజీ యూత్ అధ్యక్షుడు నూనెటి రమేష్,బొల్లెపల్లి శ్రీకాంత్, అల్లం సతీష్, రాజేందర్, విష్ణు, విగ్నేష్ ,అనిల్, రాజు తదితరులు పాల్గొన్నారు.