04-10-2025 09:43:45 PM
చేగుంట (విజయక్రాంతి): దేవీ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా చేగుంట మండల కేంద్రంలోనీ చందాయిపెట్ గ్రామంలో శివాజి యూత్, దుర్గ భవాని, ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో దుర్గామాత శోభాయాత్ర అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు, యువతీ యువకులు పెద్ద ఎత్తున పాల్గొని ఉత్సాహం నింపారు. డీజే చిన్నారులు భరతనాట్యం, అమ్మవారి వేషధారణల ప్రత్యేక బృందం సాంప్రదాయబద్ధంగా అమ్మవారి విగ్రహాన్ని ఊరేగించారు. మహిళలు సంప్రదాయ దుస్తుల్లో పూలతో, నిమ్మకాయ దండలతో అమ్మవారికి, మంగళహారతులు, చిన్నారుల భరతనాట్యం శోభాయాత్రకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అనంతరం గ్రామంలోని పెద్ద చెరువులో అమ్మవారిని నిమజ్జనం చేశారు.