04-10-2025 10:07:40 PM
జిల్లా కలెక్టర్ రాజర్షీ షా..
రిమ్స్ లో ఆకస్మిక తనిఖీలు..
ఆదిలాబాద్ (విజయక్రాంతి): జిల్లాలో నవజాత శిశు మరణాలు జరగకుండా ఎస్ఎన్సీయూలో ప్రత్యేకంగా చికిత్సలు అందించేలా చర్యలు తీసుకోవడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ రాజర్షి షా(District Collector Rajarshi Shah) అన్నారు. రిమ్స్ కు వచ్చే రోగులకు నాణ్యమైన వైద్యం అందించేల వైద్యులు కృషి చేయాలని సూచించారు. శనివారం స్థానిక రిమ్స్ ఆసుపత్రిని కలెక్టర్ ఆకస్వికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని వివిధ వార్డులను పరిశీలించి, రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. అదేవిధంగా డ్రీమ్స్ ఆవరణలోని జనరిక్ మెడికల్ షాపుల్లో సైతం తనిఖీలు చేపట్టి స్టాక్ రిజిస్టర్ లను పరిశీలించారు.
నిబంధనలను పాటించని ఓ మెడికల్ షాప్ కు నోటీసులు ఇవ్వాలని వైద్య శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... ఏ ఒక్క కేసు కూడా రీఫర్ కాకుండా మరింత పని చేయాలని సూచించారు. ఐసీఎంఆర్, రిమ్స్ సంముక్త 28 వారాలోపు పుట్టిన బిడ్డలను రక్షించేలా కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. అప్పుడే పుట్టిన బిడ్డకు తల్లిపాలు ఇవ్వాలన్నారు. మధర్ పిల్లల మధ్య స్కిన్ కాంటాక్ట్ అవ్వాలని, దీంతో పిల్లలకు ఇమ్యూనిటి పెరుగుతుందన్నారు. ఈ వివరాలు ఎప్పటికప్పుడు రిజిస్ట్రర్లో నమోదు చేయాలని ఇక్కడి సిబ్బందికి ఆదేశించినట్టు తెలిపారు. వివరాలు ఉండటంతో దీనిపై సమీక్షకు అవకాశాలుంటాయన్నారు. సమీక్షించి మరింత మెరుగైన సేవలను అందించడానికి అస్కారం ఉంటుందన్నారు. కలెక్టర్ వెంట డీఎంహెచ్ డాక్టర్ నరేందర్, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, డిప్యూటి డీఎంహెచ్ఓ సాధన, పలువురు వైద్యులు తదితరులు పాల్గొన్నారు.