calender_icon.png 4 October, 2025 | 11:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దొంగలకు దేహశుద్ధి చేసిన గ్రామస్తులు

04-10-2025 09:37:56 PM

చేగుంట,(విజయక్రాంతి): మెదక్ జిల్లా చేగుంట బైకు దొంగతనం చేసి ఎత్తుకెళ్తున్న దొంగలను పట్టుకొని దేహశుద్ధి చేసి, ఓ దొంగ చేతిలో ఉన్న పెట్రోల్ ను గుర్తించి, అదే పెట్రోల్ అతనిపై చల్లి నిప్పు పెట్టారు, వివరాలకు వెళితే మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారం గ్రామంలో శనివారం సంఘటన చోటుచేసుకుంది. గ్రామంలో ఓ బైకును ఎత్తుకెళ్లడానికి వచ్చిన ఇద్దరు వ్యక్తులు, బైకును  తీసుకెళ్లడం గమనించిన స్థానికులు అడ్డుకున్నారు. వారు బైకు దొంగతనం చేసినట్లు గుర్తించిన గ్రామస్తులు ఆగ్రహంతో వారిని దేహశుద్ధి చేస్తుండగా, ఓ దొంగ చేతిలో లో పెట్రోల్ బాటిల్ ని గుర్తించారు.

అదే పెట్రోల్ అతనిపై చల్లి నిప్పు పెట్టారు. మంటలు చల్లార్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. గాయాలైన దొంగను సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. అనంతరం తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ ఆధ్వర్యంలో విచారణ చేపట్టిన పోలీసులు, దొంగలు జంగరాయి గ్రామానికి చెందిన యేవాన్, మహిపాల్ గా గుర్తించారు. యేవాన్ కు తీవ్ర గాయాలు కాగా అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

మరో దొంగ మహిపాల్ పై చిన్న శంకరంపేట పోలీస్ స్టేషన్ లో ఫోక్సో కేసు నమోదు అయినట్లు తెలిపారు. ఇద్దరు దొంగలపై జరిగిన దాడికి సంబంధించిన వివరాలను తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్, రామాయంపేట సీఐ వెంకటరాజా గౌడ్, చేగుంట ఎస్సె చైతన్య కుమార్ రెడ్డిలు వడియారం గ్రామానికి వెళ్లి స్థానికులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించి సమగ్రసమాచారాన్ని సేకరిస్తున్నట్లు డీఎస్పీ నరేందర్ గౌడ్ తెలిపారు.