calender_icon.png 12 December, 2025 | 2:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీ చైతన్య రతన్ టాటా క్యాంపస్ ఆధ్వర్యంలో ఘనంగా స్పోర్ట్స్ మీట్ కార్యక్రమం

10-12-2025 07:50:49 PM

సనత్‌నగర్ (విజయక్రాంతి): సనత్ నగర్ శ్రీ చైతన్య రతన్ టాటా క్యాంపస్ ఎగ్జిక్యూటివ్ డీన్ మోహన్ రావు, డీన్ సతీష్ బాబు, సెంటర్ హెడ్ సంజయ్ సింగ్, ప్రిన్సిపల్ జ్యోతి, అకాడమిక్ ప్రిన్సిపల్ సతీష్ బాబు, వైస్ ప్రిన్సిపాల్ కేశవ్ ఆధ్వర్యంలో  స్పోర్ట్స్ మీట్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా విద్యార్థులచే జాతీయ గీతాన్ని పాడి ఆటల ప్రారంభించారు. విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా ఆట పోటీలలో పాల్గొన్నారు. కబడ్డీ, క్రికెట్, ఖోఖో పలు రకాల ఆటలను నిర్వహించారు.

విద్యార్థినిలు విద్యార్థులు అన్ని ఆటలలో ఉత్తమ ప్రతిభను కనపరిచారు. గెలిచిన విద్యార్థులకు విద్యార్థినిలకు కాలేజీ యాజమాన్యం షీల్డ్స్ ను మెమొంటోస్ ను అందజేశారు. ఈ సందర్భంగా కాలేజీ సిబ్బంది మాట్లాడుతూ, ఈరోజు శ్రీ చైతన్య కాలేజ్ అంటేనే భారత దేశంలో నెంబర్ వన్ గా రాణిస్తుందని అందులో ఐఐటిలో టాప్ టెన్ ర్యాంకులన్ని శ్రీ చైతన్య కాలేజీకి రావడం సంతోషదగ్గ విషయమని విద్యార్థులు చదువులతో పాటు క్రీడల్లో కూడా ఉత్తమ ప్రతిభను కనబరుస్తున్నారని విద్యార్థులకు వారి యొక్క తల్లిదండ్రులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలేజీ లెక్చరర్స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.