17 July, 2026 | 2:14 PM

Breaking News

మొక్కులు చెల్లించుకున్న మాజీ మంత్రి   •   స్కూల్ వ్యాన్‌ను ఢీకొట్టిన రైలు.. ముగ్గురు విద్యార్థులు మృతి   •   నందిపేట తహసీల్దార్ సస్పెండ్   •   పామ్ ఆయిల్ కర్మాగారంలో ప్రమాదం.. ఇద్దరికీ తీవ్రగాయాలు   •   కొండపోచమ్మ రిజర్వాయర్ వద్ద బీఆర్ఎస్ నిరసన   •   వీఓ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి   •   రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండాలి: ఎమ్మెల్యే పల్లా   •   ఆధిపత్య పోరు! విద్యార్థులు నిల్... డ్యూటీలో ఉపాధ్యాయులు   •   ప్రభుత్వ పాఠశాలల్లో నిర్లక్ష్యానికి తావులేదు: కలెక్టర్ సీరియస్   •   హైడ్రోజన్ రైలు.. సరికొత్త విప్లవానికి నాంది   •  

ఎల్‌ఐసీ ఆధ్వర్యంలో ఘనంగా యోగా డే

22-06-2024 01:17 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 21 (విజయక్రాంతి) : లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసి) హైదరాబాద్ జోనల్ ట్రైనింగ్ సెంటర్ క్యాంపస్‌లో అంతర్జాతీయ యోగా డే శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా రీజినల్ మేనేజర్ జీబీవీ రామయ్య మాట్లాడుతూ.. ఈ సంవత్సరం సమాజం కోసం యోగా అనే థీమ్‌తో అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నట్టు తెలిపారు. యోగాపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకోవాలన్నారు. యోగా గురువు కరుణాకర్, ఎల్‌ఐసీ సీనియర్ అధికారులు కె. థామస్, రాజీబ్ బిస్వాస్, జి. మధుసూధన్, ప్రమోద్ కుమార్ సాహూ, ఆర్. శరవణన్ తదితరులు పాల్గొన్నారు. ప్రతిరోజూ ఉదయం 5.30 నుంచి 6.30 గంటల వరకూ ఇందిరాపార్కు లో జరిగే ఉచిత యోగా శిక్షణ తరగతులను ఎల్‌ఐసి స్పాన్సర్ చేస్తుందన్నారు.